ఇదిగో అసలు సిసలైన బ్యూటీ క్వీన్.. బ్లూ బ్లేజర్ లో కీర్తి సురేష్ కిల్లింగ్ లుక్స్, ట్రెండింగ్ గా మారిన పిక్స్

Published : Sep 17, 2023, 01:30 PM IST

కీర్తి సురేష్ కి సౌత్ లో ప్రత్యేకమైన స్థానం ఉంది. హోమ్లీ బ్యూటీ ఇమేజ్ తో పాటు, గ్లామర్ ఇమేజ్ కూడా కీర్తి సురేష్ సొంతం. చూడచక్కని రూపంతో పాటు నటన పరంగా కూడా కీర్తి సురేష్ తనకు తిరుగులేదని నిరూపించుకుంది.

PREV
112
ఇదిగో అసలు సిసలైన బ్యూటీ క్వీన్.. బ్లూ బ్లేజర్ లో కీర్తి సురేష్ కిల్లింగ్ లుక్స్, ట్రెండింగ్ గా మారిన పిక్స్

కీర్తి సురేష్ కి సౌత్ లో ప్రత్యేకమైన స్థానం ఉంది. హోమ్లీ బ్యూటీ ఇమేజ్ తో పాటు, గ్లామర్ ఇమేజ్ కూడా కీర్తి సురేష్ సొంతం. చూడచక్కని రూపంతో పాటు నటన పరంగా కూడా కీర్తి సురేష్ తనకు తిరుగులేదని నిరూపించుకుంది.

212

 మహానటి ఒక్క చిత్రం చాలు కీర్తి సురేష్ నటన గురించి చెప్పడానికి. హోమ్లీగా ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పిస్తూనే,అవసరమైనప్పుడు గ్లామర్ ఒలకబోస్తూ కవ్విస్తోంది. 

312

 నేను శైలజ చిత్రంతో కీర్తి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో అందరి దృష్టి కీర్తి సురేష్ పై పడింది. కీర్తి సురేష్ సినిమాల్లో గ్లామర్ రోల్స్ చేస్తుంది. 

412

కానీ ఎప్పుడూ హద్దులు దాటేలా అందాలు ఆరబోయలేదు. నటనతోనే పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. సౌత్ టాప్ హీరోయిన్ల సరసన చేరింది. అనేక విజయాలు సొంతం చేసుకుంది. 

512

కీర్తి సురేష్ లేటెస్ట్ ఫోటోలు మైండ్ బ్లోయింగ్ అనిపిస్తున్నాయి. బ్లూ బ్లేజర్ లో కీర్తి సురేష్ స్టైలిష్ గా మెరుపులు మెరిపించింది. కుర్రాళ్లు ఇంత అందానికి షాక్ అవుతున్నారు. 

612

కీర్తి సురేష్ తాజాగా దుబాయ్ లో జరుగుతున్న సైమా అవార్డుల వేడుకలో మెరిసింది. బ్లూ బ్లేజర్ లో చిరునవ్వులు చిందిస్తూ మైమరపించే విధంగా ఫోజులు ఇచ్చింది. 

712

   ప్రతి ఏడాది కనుల పండుగలా జరిగే సౌత్ సినీ వేడుక సైమా అవార్డ్స్ వేడుక దుబాయ్ వేదికగా అట్టహాసంగా ప్రారంభం అయింది. సౌత్ నుంచి పలువురు సినీ తారలు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.

812

  ప్రతిష్టాత్మకంగా సాగే ఈ అవార్డ్స్ వేడుకలో చాలా మంది స్టార్ హీరోలు, హీరోయిన్లు అవార్డులు గెలుచుకున్నారు.   ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా సైమా అవార్డ్స్ 2023 లో విజేతగా నిలిచాడు.

912

రోజు రోజుకి కీర్తి సురేష్ అందం రెట్టింపు అవుతోంది. చీరని తలపించే విధంగా ఉన్న డిజైనర్ డ్రెస్ లో కీర్తి సురేష్ మెస్మరైజ్ చేసే ఫోజులు ఇచ్చింది. చంద్రబింబంలాగా వెలిగిపోతున్న ఆమె సొగసు చూసి నెటిజన్లు ఏముంది బాబోయ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

1012

కీర్తి సురేష్ నేచురల్ స్టార్ నాని సరసన దసరా చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. చాలా రోజుల తర్వాత నానికి దసరా చిత్రంతో బాక్సాఫీస్ హిట్ దక్కింది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ వెన్నెల పాత్రలో అద్భుతంగా నటించింది. 

1112

తెలంగాణ యాసలో డైలాగులు చెబుతూ కీర్తి బాగా ఆకట్టుకుంది. తెలంగాణ యువతిగా కీర్తి కాస్త డీ గ్లామర్ గా కనిపిస్తూ చేసిన పాత్రకు ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం కీర్తి సురేష్.. ఉదయనిధి స్టాలిన్ సరసన నటించిన మామన్నాన్ చిత్రం జూన్ 29న రిలీజ్ అవుతోంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా కీర్తి ఇలా మెరిసింది. 

1212

అలాగే కీర్తి సురేష్ మెగాస్టార్ చిరంజీవి బోళా శంకర్ చిత్రంలో కీలక పాత్రలో నటించింది. ఈ చిత్రాల్లో ఆమె చిరంజీవి సోదరిగా నటించింది. కానీ ఈ చిత్రం దారుణంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. 

 

click me!

Recommended Stories