దక్షిణాది సినీ నటి కీర్తి సురేష్. అద్భుత నటనతో అగ్ర స్థాయికి చేరుకున్నారు. అనేక అవార్డులు అందుకున్నారు.
1992లో మలయాళ చిత్ర నిర్మాత జి. సురేష్ కుమార్, తమిళ నటి మేనక దంపతులకు జన్మించారు. చెన్నైలో 4వ తరగతి వరకు చదివి, కేంద్రీయ విద్యాలయ, పట్టోం, కేరళలో చదువు పూర్తి చేశారు. చిన్నతనంలో ఈత నేర్చి అనేక అవార్డులు గెలుచుకున్నారు.