
చిత్ర పరిశ్రమలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా లేకుండా రాణించడం చాలా కష్టం. ఫస్ట్ మొదటి అవకాశం కోసం చాలా స్ట్రగుల్ అవ్వాల్సిందే. చేయి అందించే వారు దొరకడం చాలా కష్టం. మొదట నమ్మడం చాలా కష్టం. ఒక్కసారి ఆ నమ్మకం వచ్చాక, మనం ఏంటో నిరూపించుకున్నాక చాలా వరకు ఎంకరేజ్ మెంట్ ఉంటుంది. కానీ అక్కడి వరకు రావాలంటే వర్ణించలేని స్ట్రగుల్స్ ఉంటాయని వేరే చెప్పక్కర్లేదు.
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా టాలీవుడ్ లో హీరోలు నిలదొక్కుకోవడం కూడా కష్టమే. కొంత వరకు వెళ్లినా, ఏదో చోట ఆగిపోవాల్సి రావడమో, ఏదో జరుగుతుంటుంది. కానీ అలాంటి వాటిని దాటుకుని హీరోగా నిలబడటం, స్టార్ హీరోగా ఎదగడం అంటే మామూలు విషయం కాదు. కానీ వాటిని బ్రేక్ చేసి హీరోలుగా నిలబడ్డారు. చిరంజీవి, రవితేజ వంటి స్టార్స్ అలా స్ట్రగుల్ అయిన నిలబడ్డారు. తమకి తాము రాచబాటలు వేసుకున్నారు. ఇప్పుడు విజయ్, నాని, విశ్వక్, అడివి శేష్, నవీన్ పొలిశెట్టి,సిద్దు జొన్నలగడ్డ కూడా ఆ కోవలోనే నిలబడుతున్నారు. ఏకంగా ఎక్స్ ప్రెస్ వేలు నిర్మించుకుంటున్నారు. మరి ఆ యంగ్ హీరోస్ ఎవరో ఓ లుక్కేద్దాం.
సిద్దు జొన్నలగడ్డ.. దాదాపు పది, పదిహేనేళ్లు ఇండస్ట్రీలో స్ట్రగుల్ అవుతూనే ఉన్నాడు. ఆయనకు బ్యాక్ సపోర్ట్ ఎవరూ లేరు. తనే చిన్న చిన్న రోల్స్ నుంచి, తనే కథ, మాటలు రాసుకునే వరకు అన్నీ తానై చేసుకుంటూ వచ్చాడు. ఎంతో స్ట్రగుల్ అయ్యాడు. కానీ ఇప్పుడు `డీజే టిల్లు`తో సక్సెస్ కొట్టాడు, ఇప్పుడు లైఫ్ వచ్చింది. లేటెస్ట్ గా విడుదలైన `టిల్లు స్వ్కేర్`తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఈ మూవీ వంద కోట్ల దిశగా పరుగులు పెడుతుంది. ఓ కుర్ర హీరోకి ఇది అసాధారణమైన విషయమే, దీంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ చూపు తనవైపు తిప్పుకున్నాడు. ఇప్పుడు తనకి తాను రాచబాట వేసుకున్నాడు. కొన్నేళ్లపాటు సిద్దుకి ఇండస్ట్రీలో డోకా లేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
అలానే నేచురల్ స్టార్ నాని. ఆయన కూడా సినిమాల్లో నిలదొక్కుకునేందుకు నానాకష్టాలు పడ్డారు. ఆర్జే నుంచి ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్‌గా రావడం వరకు ఎన్నో కష్టాలు పడ్డారు. అవకాశాల కోసం ఎన్నో ఆఫీసులు తిరిగారు. మణిరత్నం వద్ద అసిస్టెంట్ గా జాయిన్ అవ్వడమే పెద్ద అఛీవ్‌మెంట్ అంటే `అష్టాచెమ్మా`తో హీరోగా పరిచయం అయిన సక్సెస్ కావడంతోపాటు ఇప్పుడు స్టార్ ఇమేజ్ కోసం పదేళ్లకిపైగా పోరాటం చేశాడు. `దసరా`, `హాయ్ నాన్న`తో ఆ సక్సెస్ సాధించాడు. ఇప్పుడు స్టార్ హీరోల జాబితాలోకి చేరిపోయాడు. ఇప్పుడు ఆయన లైనప్ టూ క్రేజీగా, భారీగా ఉండటం విశేషం. ఓ రకంగా తన బేస్‌ని బలంగా నిర్మించుకున్నాడు నాని. ఇక తిరుగులేని బేస్ వేసుకున్నాడు, అడ్డే లేకుండా ఎక్స్ ప్రెస్ వే నిర్మించుకున్నాడు.
ఈ కోవకే రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ వస్తాడు. వాళ్ల నాన్న టీవీ పరిశ్రమలో పనిచేశాడు. కానీ అది విజయ్‌కి అవకాశాలను తేవడంలో ఏమాత్రం ఉపయోగపడలేదు. చాలా ఏళ్లు తను అందరిలాగే స్ట్రగుల్ అయ్యాడు. గుర్తింపు లేని పాత్రలు చేశాడు. ఆ తర్వాత నానితోనే `ఎవడే సుబ్రమణ్యం`తో అందరి చూపు ఆకర్షించాడు. `పెళ్లి చూపులు` సినిమాతో హీరోగా నిలబడ్డాడు. `అర్జున్ రెడ్డి`, `గీతగోవిందం`తో బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకుని స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. `గీతగోవిందం` సమయంలో విజయ్ క్రేజ్‌కి యూత్ ఫిదా అయిపోయారు. అమ్మాయిలు పిచ్చెక్కిపోయారు.
ఆ తర్వాత వరుస పరాజయాలను దాటుకుని `ఖుషి`తో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చాడు. ఇప్పుడు `ఫ్యామిలీస్టార్`తో తన బేస్‌ని బలంగా వేసుకునే పనిలో, ఇక తిరుగే లేదు అనేలా ఎక్స్ ప్రెస్ వే నిర్మించుకుంటున్నాడు విజయ్ దేవరకొండ. `కేరింత` సినిమాకి ఆడిషన్‌కి వెళ్లితే దిల్ రాజు వాళ్లు రిజెక్ట్ చేశారని చెప్పాడు విజయ్. ఇప్పుడు అదే బ్యానర్‌లో `ఫ్యామిలీ స్టార్` సినిమా చేస్తున్నాడు. హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. యాటిట్యూడ్‌తో కాదు, సక్సెస్‌తో మాట్లాడాలని ఇప్పుడు సైలెంట్‌గా ఉంటున్నట్టు చెప్పాడు. నెక్ట్స్ విజయ్ లైనప్ భారీగా ఉంది. కొడితే కుంభస్థలమే అనేలా ఆయన తన కెరీర్‌కి ఎక్స్ ప్రెస్ వే వేసుకుంటుండటం విశేషం.
విశ్వక్ సేన్ సైతం ఈ జాబితాకే చెందుతాడు. హైదరాబాద్ మామూలు మిడిల్ క్లాస్‌కి చెందిన విశ్వక్ సేన్ సినిమా అవకాశాల కోసం ఎన్నో సినిమాలకు ఆడిషన్‌కి వెళ్లాడు. తిరస్కరించబడ్డాడు. డబ్బుల కోసం వెనకాల నిలబడే పాత్రలు కూడా చేశాడు. ఎవరూ ఛాన్స్ లు ఇవ్వకపోతే తనే దర్శకుడిగా, నిర్మాతగా, హీరోగా మారి `ఫలక్‌నూమా దాస్` చిత్రం చేసి హిట్ కొట్టి తానేంటో నిరూపించుకున్నాడు. ఒకదాని తర్వాత ఒకటి సినిమా చేస్తూ, తన మార్కెట్ పెంచుకుంటున్నాడు. అద్భుతమైన నటుడిగా నిరూపించుకుంటున్నాడు. కెరీర్ కి రాచబాట వేసుకుంటున్నాడు.
అడవి శేష్.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదు. అమెరికాలో జాబ్ చేశాడు. సినిమాపై ప్యాషన్‌తో ఈ రంగంలోకి వచ్చాడు. ఎన్నో ప్రయత్నాలు చేశాడు, కానీ లాభం లేదు. `సొంతం`లో నటించినా ఎవరూ గుర్తించలేదు. ఆఫర్లువచ్చే అవకాశం లేదు. దీంతో తన కెరీర్‌తానే నిర్మించుకోవాలనుకున్నాడు, రైటర్‌గా, దర్శకుడిగా మారి `కర్మ` అనే సినిమా చేసి బోల్తా కొట్టాడు. ఆ తర్వాత `పంజా`లో నటించే ఆఫర్ అందుకున్నాడు. దీంతో ఇండస్ట్రీలో పాపులర్ అయిపోయాడు.
`బలుపు` సినిమాలో నటించినా పేరు రాలేదు. దీంతో మళ్లీ దర్శకుడిగా `కిస్` చిత్రం చేశాడు. మళ్లీ పరాజయం. దీంతో `రన్ రాజా రన్`, `లేడీస్ అండ్ జెంటిల్మన్` చిత్రాలతో మెప్పించాడు. `దొంగాట`లో నటుడిగా మెప్పిస్తే, `బాహుబలి`లో గుర్తింపు వచ్చింది. అయినా సరైన పాత్రలు రావడం లేదనే లోటు వెంటాడుతూనే ఉంది. `క్షణం` సినిమా లైఫ్ ఇచ్చింది. దీన్ని తానే కూర్చొని చేసుకున్నాడు. హిట్ కొట్టాడు. ఇలా ఒక్కో సినిమాతో కెరీర్‌ని బిల్డ్ చేసుకుంటూ `అమి తుమీ`, `గూఢచారి`, `ఎవరు`, `మేజర్`, `హిట్ 2` చిత్రాలతో హీరోగా నిలబడ్డాడు. ఇప్పుడు పాన్ ఇండియాస్టార్ అయిపోయాడు. ప్రస్తుతం `గూఢచారి 2`తో రాబోతున్నారు. దీంతోపాటు మరికొన్ని సినిమాలు లైన్‌లో ఉన్నాయి. ఇలా తనుక తానే బాటలు, రాచబాటలు వేసుకున్నాడు అడివిశేష్.
తనని తాను చెక్కుకుంటూ వచ్చిన హీరోల్లో నవీన్ పొలిశెట్టి కూడా ఉన్నారు. ఆయన అవకాశాల కోసం హైదరాబాద్, ముంబయిలో తిరిగాడు. సాధారణ కుర్రాడిలా అన్ని కష్టాలుపడ్డాడు. సినిమాలు, టెలివిజన్ ఏది పడితే అది చేసుకుంటూ వచ్చాడు. `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ` చిత్రంతో హీరోగా నిలబడ్డాడు. `జాతిరత్నాలు`తో బ్లాక్ బస్టర్ అందుకుని స్టార్ అయిపోయాడు. ఇటీవల `మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి`తో హిట్ అందుకుని కెరీర్‌కి రాచబాటలు వేసుకుంటున్నాడు. ఇక తనకు తిరుగే లేదు అనేలా ముందుకు సాగుతున్నాడు. ఇలా వీరంతా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా నానా కష్టాలు పడి, హీరోలుగా నిలదొక్కుకున్నాడు. ఇప్పుడు యంగ్ స్టర్స్ నుంచి స్టార్ హీరోలుగా ఎదుగుతున్నారు.