అందాలతో మంటలు రేపుతున్న మల్లు బ్యూటీ.. పొట్టి డ్రెస్ లో మైండ్ బ్లాక్ చేసేలా మాళవికా మోహనన్ స్టిల్స్..

First Published | May 18, 2023, 8:16 PM IST

మలయాళీ యంగ్ బ్యూటీ మాళవికా మోహనన్ (Malavika Mohanan) గ్లామర్ మెరుపులతో నెట్టింట మంటలు రేపుతోంది. అందాలతో కుర్రగుండెల్లో గంటలు మోగిస్తోంది. లేటెస్ట్ పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. 
 

యంగ్ హీరోయిన్ మాళవికా మోహనన్  తమిళ చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకుంది. తన టాలెంటెట్ మరియు అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తమిళ స్టార్ విజయ్ దళపతి సరసన ‘మాస్టర్’లో నటించి  మంచి గుర్తింపు దక్కించుకుంది. 
 

ఆ చిత్రం తెలుగులోనూ డబ్డ్ వెర్షన్ లో రిలీజ్ కావడంతో తెలుగు ప్రేక్షకుల్లోనూ క్రేజ్ దక్కించుకుంది. ప్రస్తుతం కోలీవుడ్ లోనే స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంటోంది. ఈ క్రమంలో చియాన్ విక్రమ్ కు జోడీగా ‘తంగలాన్’లోనూ నటిస్తున్న విషయం తెలిసిందే. 
 


ఇదిలా ఉంటే మాళవికా మోహనన్ కోలీవుడ్ పైనే కాకుండా ఇతర భాష చిత్రాలపైనా ఆసక్తి చూపుతోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తూ స్టన్నింగ్ ఫొటోషూట్లతో అదరగొడుతోంది. గ్లామర్ మెరుపులతో మతులు పోగొడుతోంది. 

మాళవికా లేటెస్ట్ గా పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి. కుర్ర భామ గ్లామర్ షోకు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా స్టన్ అవుతున్నారు. లేటెస్ట్ ఫిక్స్ లో మినీ డ్రెస్ లో దర్శనమిచ్చింది. చిన్న స్కర్ట్, టైట్ ఫుల్ స్లీవ్ టాప్ లో పరువాలను ప్రదర్శించింది. మతులుపోయేలా ఫోజులిచ్చింది.
 

యంగ్ బ్యూటీ ఇతర భాషల చిత్రాల్లోనూ  అవకాశాలను అందుకునేందుకు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తోంది. ఈ క్రమంలో డైలీ వర్కౌట్స్ చేస్తూ తనను మరింత స్లిమ్ గా మార్చుకుంటోంది. దీంతో నాజుకూ అందాలను ప్రదర్శించేలా అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తోంది.

మరోవైపు మాళవిక మోహనన్ కు టాలీవుడ్ ఎంట్రీపై ఆసక్తి ఉన్నట్టు తెలుస్తోంది. గతంలోనే ఈ యంగ్ బ్యూటీ తన మనస్సులోని కోరికను చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) సరసర మారుతీ సినిమాలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

Latest Videos

click me!