కృతి శెట్టి రాయల్ లుక్.. లెహంగా వోణీలో బేబమ్మ మెరుపులు.. అదిరిపోయిన ఫోజులు

First Published | May 18, 2023, 10:00 PM IST

యంగ్ హీరోయిన్ కృతి శెట్టి (Krithi Shetty) బ్యూటీఫుల్ లుక్ లో మెరిసింది. లెహంగా వోణీలో ట్రెడిషనల్ గా దర్శనమిచ్చి ఆకట్టుకుంటోంది. సంప్రదాయ దుస్తుల్లో వెలిగిపోతోంది. లేటెస్ట్ పిక్స్ అదిరిపోయేలా ఉన్నాయి.
 

‘ఉప్పెన’తో హీరోయిన్ కృతి శెట్టి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. పంజావైష్ణవ్ తేజ్ సరసన నటించి ప్రేక్షకుల మనస్సులను గెలుచుకుంది. తొలిచిత్రంతోనే మంచి గుర్తింపు దక్కించుకుంది. తన పాత్రకు న్యాయం చేసి ‘బేబమ్మ’గా క్రేజ్ సాధించుకుంది.
 

ఇండస్ట్రీలోకి ఇలా అడుగుపెట్టిందో లేదో కృతి శెట్టికి వరుసగా మూడు చిత్రాలు సక్సెస్ అందించాయి. దీంతో హ్యాట్రిక్ బ్యూటీగానూ ముద్ర వేసుకుంది. ఇక నాని సరసన ‘శ్యామ్ సింగరాయ్’లో బోల్డ్ పెర్ఫామెన్స్ తోనూ మతులు పోగొట్టింది. దాంతో మరిన్ని ఆఫర్లను అందుకుంది. 
 


అయితే, ఇటీవల కృతి శెట్టికి కాలం కలిసి రావడం లేదనే చెప్పాలి. బేబమ్మ నటించిన ‘ది వారియర్’, ‘మాచెర్ల నియోజకవర్గం’, ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ వంటి చిత్రాలు వరుసగా డిజాస్టర్ ను అందించాయి. దీంతో కృతి శెట్టి జోరుకు బ్రేకులు పడ్డాయి. 
 

రీసెంట్ గా ‘కస్టడీ’ Custody చిత్రంతో ప్రేక్షకులకు ముుందుకు వచ్చింది. నాగచైతన్యకు జోడీగా నటించిన ఈ ముద్దుగుమ్మకు ఈ సినిమాతోనూ పెద్దగా ఒరిగిందేమీ లేదని తెలుస్తోంది. ఏదేమైనా మున్ముందు బేబమ్మకు మరో హిట్ పడాల్సిందేనంటున్నారు. 
 

ఇదేసమయంలో  కృతి శెట్టి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో నయా లుక్ తో మైమరిపిస్తోంది. తాజాగా ట్రెడిషనల్ దుస్తుల్లో మెరిసిపోయింది. 

హెవీ ఎంబ్రాయిడింగ్ గల పింక్ లెహంగా, వోణీలో బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. అదిరిపోయే ఫోజులిస్తూ కుర్రాళ్లను కట్టిపడేసింది. నిషా కళ్లతో యువతకు మత్తెక్కించింది. దీంతో బేబమ్మ ఫొటోలను లైక్స్, కామెంట్లతో షేర్ చేస్తున్నారు. బ్యూటీఫుల్ అంటూ ఆకాశానికి ఎత్తుతున్నారు. 

Latest Videos

click me!