Samantha Ruth Prabhu
గత మూడేళ్ళుగా సమంత జీవితం కుదుపులకు గురవుతుంది. 2021లో ఆమె భర్త నాగ చైతన్యతో విడిపోయింది. మనస్పర్థలు తలెత్తిన నేపథ్యంలో విడాకులు తీసుకున్నారు. ఏడాది చివర్లో అధికారికంగా విడాకుల ప్రకటన చేశారు. విడాకుల కారణం సమంత డిప్రెషన్ కి గురైంది.
విడాకుల విషయంలో సమంత విమర్శలకు గురయ్యారు. సమంత ప్రవర్తనే విడాకులకు దారి తీసిందని ఆమెపై ఆరోపణలు చేశారు. ఎఫైర్స్ అంటగట్టడంతో పాటు సమంతకు పిల్లల్ని కనడం ఇష్టం లేదంటూ పుకార్లు తెరపైకి వచ్చాయి.
డిప్రెషన్ నుండి బయటపడేందుకు సమంతకు ఏడాది సమయం పట్టింది. వెంటనే మరో సమస్య ఆమెను వెంటాడింది. సమంతకు మయోసైటిస్ అనే వ్యాధి సోకింది. ఏడాదికి పైగా సమంత ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటుంది. ఏకంగా ఆరు నెలలు ఆమె ఇంటికే పరిమితమయ్యారు.
Samantha
పలు దేశాల్లో ఆమె చికిత్స తీసుకుంటుంది. సుదీర్ఘ కాలం ఆమె ఈ వ్యాధితో యుద్ధం చేయాల్సి ఉంది. కాగా మయోసైటిస్ తో పాటు సమంత మరో వ్యాధి కూడా ఉందట. అదేమిటంటే సమంతకు పూలు అంటే అలెర్జీ అట. పూలను తాకినా, వాసన చూసినా ఆమెకు పడదట.
Samantha
గతంలో ఈ విషయాన్ని సమంత స్వయంగా వెల్లడించింది. సమంత ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటారు. ప్రతిరోజూ వ్యాయామం చేస్తుంది . అయినప్పటికీ అనుకోని ఆరోగ్య సమస్యలు ఆమెను వెంటాడుతున్నాయి.
సమంత ప్రస్తుతం బ్రేక్ లో ఉంది. ఆమె కొత్త ప్రాజెక్ట్స్ కి సైన్ చేయడం లేదు. గత ఏడాది శాకుంతలం, ఖుషి చిత్రాల్లో నటించింది. నెక్స్ట్ సిటాడెల్ వెబ్ సిరీస్లో కనిపించనుంది. అమెజాన్ ప్రైమ్ లో సిటాడెల్ స్ట్రీమ్ కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.