Keerthy Suresh: కుంచె నుండి జారిన కుందనపు బొమ్మగా కీర్తి... వింటేజ్ లుక్ లో అద్భుతం చేస్తున్న అమ్మడు

Published : Dec 01, 2021, 04:02 PM IST

కీర్తి సురేష్ నటించిన పాన్ ఇండియా చిత్రం మరక్కార్. మోహన్ లలో హీరోగా నటిస్తుండగా అర్జున్, సునీల్ శెట్టి, సుహాసిని వంటి స్టార్స్ కీలక రోల్స్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంది. 

PREV
16
Keerthy Suresh: కుంచె నుండి జారిన కుందనపు బొమ్మగా కీర్తి... వింటేజ్ లుక్ లో అద్భుతం చేస్తున్న అమ్మడు

ఈ మూవీలో కీర్తి రోల్ నేమ్ ఆర్చ. కథలో కీలకమైన ఈ పాత్ర కోసం 16వ శతాబ్దం నాటి కేరళ అమ్మాయి లుక్ ట్రై చేశారు. స్వతహాగా మలయాళీ అమ్మాయైన కీర్తి సురేష్, ఆ పాత్రలో చాలా సహజంగా ఒదిగిపోయారు. ఈ ఆర్చ రోల్ లుక్ కి స్ఫూర్తిని ఇచ్చిన ఒకప్పటి పెయింటింగ్స్ కీర్తి సురేష్ తన ఇంస్టాగ్రామ్ లో పంచుకున్నారు. 

26

సదరు పెయింటింగ్స్  లో ఉన్న స్త్రీల కట్టుబొట్టు ఉన్నది ఉన్నట్లు కీర్తి సురేష్ అనుకరించారు. అలనాటి అద్భుతమైన పెయింటింగ్స్ గెటప్స్ లో కీర్తి చాలా సహజంగా ఒదిగిపోయారు. ఇక మహానటి మూవీ ద్వారా వింటేజ్ పాత్రలలో తాను ఏమిటో నిరూపించుకున్న కీర్తి సురేష్ మరక్కార్ మూవీ ద్వారా మరోసారి అద్భుతం చేయనున్నారు.  

36

నాలుగు బాషలలో భారీ ఎత్తున మరక్కార్ డిసెంబర్ 2న విడుదల కానుంది. మోహన్ లాల్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో మరక్కార్ తెరకెక్కింది. దర్శకుడు ప్రియదర్శన్ మరక్కార్ చిత్రాన్ని తెరకెక్కించారు. 

46

మరోవైపు మహేష్ హీరోగా తెరకెక్కుతున్న సర్కారు వారి పాట (Mahesh babu)మూవీలో కీర్తి హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో ఉండగా... కీర్తి పాల్గొంటున్నారు. సంక్రాంతి రేసు నుండి తప్పుకున్న సర్కారు వారి పాట (Sarkaru vaari paata)సమ్మర్ కి షిఫ్ట్ అయ్యింది.

56

లేటెస్ట్ గా అన్నాత్తే మూవీ తో  మరో భారీ హిట్ తన ఖాతాలో వేసుకుంది రజినీకాంత్ (Rajinikanth)హీరోగా దర్శకుడు శివ తెరకెక్కించిన అన్నాత్తే వసూళ్ల వర్షం కురిపిస్తుంది. కీర్తి ఈ మూవీలో రజినీకాంత్ చెల్లిగా నటించడం విశేషం. 

66

అయితే తెలుగులో ఈ మూవీ అనుకున్నంత విజయం సాధించలేదు. ఇక గుడ్ లక్ సఖి టైటిల్ తో తెరకెక్కిన లేడీ ఓరియెంటెడ్ స్పోర్ట్స్ డ్రామా విడుదలకు సిద్ధంగా ఉంది. చేతినిండా ఆఫర్స్ తో సూపర్ ఫార్మ్ లో ఉన్న కీర్తి దూసుకుపోతున్నారు. సౌత్ లో అన్ని బాషలలో సినిమాలు చేస్తూ తన స్టార్డం నిరూపించుకుంటున్నారు. 

Also read Samantha: బోల్డ్ అండ్ స్టైలిష్... లేటెస్ట్ ఫోటో షూట్ లో సమంత గ్లామర్ జస్ట్ మైండ్ బ్లోయింగ్!

Also read మెస్మరైజ్ చేస్తున్న ప్రియమణి.. సిల్వర్ మెరుపులు అదుర్స్, 37 ఏళ్ల వయసులో చూపుతిప్పుకోలేని సోయగాలు

click me!

Recommended Stories