Pawan kalyan:పవన్ రాజకీయాలలో ఉండడు.. ఆయన జాతకమే అంత... వేణు స్వామి సంచలన జోస్యం

Published : Dec 01, 2021, 01:56 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan kalyan) డై హార్డ్ ఫ్యాన్స్ ఆయనను సీఎం సీటులో చూడాలని వేయికళ్లతో ఎదురుచూస్తుండగా... సంచలన జోతిష్యుడు వేణు స్వామి లేటెస్ట్ కామెంట్స్ ఆ ఆశలపై నీళ్లు చల్లాయి. సీఎం పదవి అటుంచితే పవన్ అసలు రాజకీయాలలోనే ఉండడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. 

PREV
19
Pawan kalyan:పవన్ రాజకీయాలలో ఉండడు.. ఆయన జాతకమే అంత... వేణు స్వామి సంచలన జోస్యం

అన్నయ్య చిరంజీవి (Chiranjeevi) రాజకీయప్రస్థానం ముగిశాక పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం మొదలైంది. 2014లో జనసేన పార్టీని  గ్రాండ్ గా లాంచ్ చేశారు. చిరంజీవి విఫలమైనా పవన్ విజయం సాధిస్తాడని, సీఎం సీటు అధిరోహిస్తారని మెగా ఫ్యాన్స్ గట్టి నమ్మకం పెట్టుకున్నారు.

29
pawan kalyan

అయితే పవన్ తొలి అడుగులే తడబడ్డాయి. సోషలిస్ట్ భావజాలమే మా పార్టీ సిద్ధాంతామన్న పవన్ కళ్యాణ్  టీడీపీ, బీజేపీ పార్టీ మిత్రపక్షంగా చేరడం ప్రజలతో పాటు ఆ పార్టీ కార్యకర్తలు షాక్ ఇచ్చింది. వీలైనంత త్వరగా జనసేన పార్టీని నిర్మించాలి, ఎన్నికలలో క్రియాశీలకంగా మారాలన్న కార్యకర్తల ధ్యేయం దెబ్బతింది.

39
Pawan Kalyan

ఒకవేళ 2014 ఎన్నికలకు జనసేన సంసిద్దత సాధించని నేపథ్యంలో ఎన్నికలకు దూరంగా న్యూట్రల్ గా ఉన్నా సరిపోయేది. అలా కాకుండా టీడీపీ, బీజేపీ కూటమిలో చేరడం ద్వారా జనసేన ఒక ప్రత్యామ్నాయ పార్టీ అనే నమ్మకం కోల్పోయింది. 
 

49

ఇక పవన్ కళ్యాణ్ నిలకడలేని నిర్ణయాలు, సిద్ధాంతాలు ఎవరికీ అర్థం కావు. ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు అవినీతిపరుడంటూ చంద్రబాబును తీవ్ర స్థాయిలో విమర్శించిన ఆయన, 2014 ఎన్నికల్లో అనుభవజ్ఞుడు అంటూ మద్దతు తెలిపారు. మరి ఆయన లాజిక్ కరెక్ట్ అయితే అనుభవజ్ఞుడైన అవినీతిపరుడితో సమాజానికి ఇంకా చేటు కదా.

59

2019 ఎన్నికలకు ముందు టీడీపీతో విభేదించారు... చంద్రబాబు (Chandrababu), లోకేష్ పై ఆరోపణలు చేశారు. బీజేపీతో కూడా ఆయన ఇదే తీరున వ్యవహరించారు. టీడీపీతో పొత్తులో ఉన్నప్పుడు బీజేపీని విమర్శించారు. ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో మోడీ గ్రేట్ లీడర్ అంటూ బీజేపీ మిత్రపక్షం గా చేరిపోయారు. 

69

ఎన్నికల కమీషన్ దృష్టిలో జనసేన ఒక గుర్తింపు లేని పార్టీ. దానికి గతంలో కేటాయించిన గ్లాసు గుర్తు కూడా రద్దు చేయడం జరిగింది. ఎనిమిదేళ్ళ జనసేన పార్టీలో ప్రస్థానంలో సాధించింది ఏంటయ్యా అంటే ఒక ఎమ్మెల్యే సీటు.

79

 
ఈ సమీకరణాలు ఇలా ఉండగా... వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి పవన్ పొలిటికల్ కెరీర్ ముగిసినట్లే అంటూ సంచలనానికి తెరలేపారు. పవన్ మాట నిలకడలేని వ్యక్తి. ఒక సిద్ధాంతం అంటూ లేదు. అతడు అలా ప్రవర్తించడానికి కారణం.. జాతకమే అన్నారు. 

89
pawan kalyan

ఇక 2024 తర్వాత పవన్ కి రాజకీయ భవిష్యత్ లేదు. ఆయన పాలిటిక్స్ నుండి తప్పుకుంటారు. ఆయన జాతకం ప్రకారం జరిగేది ఇదే. నా మాటలు కొందరిని బాధపెట్టవచ్చు. దాని వలన నాపై దాడులు కూడా జరగవచ్చు. అయితే నేను ఎవరికీ భయపడను. జాతకం ఏమి చెబుతుందో అదే చెబుతున్నారు అన్నారు. 

99

గతంలో వేణు స్వామి చెప్పిన మాటలు నిజమైన నేపథ్యంలో ఈ కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 2019లో టీడీపీ ఓడిపోతుందని, సమంత నాగ చైతన్య ఓడిపోతారని, అఖిల్ నిశ్చితార్థం పెళ్లి వరకు వెళ్ళదని వేణు స్వామి చెప్పగా.. అలాగే జరిగింది. కాగా జగన్ మరో మూడు పర్యాయాలు సీఎం అవుతారని వేణు స్వామి చెప్పడం కొసమెరుపు.

Read more Photos on
click me!

Recommended Stories