పెళ్ళి ఫిక్స్.. తేల్చేసిన కీర్తి సురేష్ తల్లి మేనక, పెళ్లెప్పుడు..? వరుడు ఎవరంటే..?

First Published | Oct 22, 2022, 5:46 PM IST

ఈ మధ్య ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుసగా పెళ్లి పీఠలు ఎక్కుతున్నారు స్టార్లు. కొంత మంది సడెన్ గా పెళ్లి బాజాలు మోగిస్తుంటే.. మరికొంత మంది మాత్రం ఘనంగా పెళ్లిల్లు చేసుకుంటున్నారు. ఇక క్రమంలోనే స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి అంటూ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ కీర్తిపెళ్ళెప్పుడు..?

పద్దతికి ఓ పేరంటూ ఉంటే ఇలానే ఉంటుందేమో అన్నట్టు ఉంటుంది కీర్తి సురేష్  . మహానటి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులు మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన కీర్తీ సురేష్.. చాలా కాలా కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది.  అయితే తన కెరీర్ కు బ్రేక్ ఇచ్చిన మహానటి వల్లే ఆతరువాత ఆమె ఏ సిమాలు సరిగ్గా నడవలేదు. మహానటిగా కీర్తిని చూసిన ఆడియన్స్ ఇంకే పాత్రలో తనను చూడలేకపోయారు. 

ఇక ఆ మూస నుంచి బయటకు వచ్చిన స్టార్ హీరోయిన్.. ఈమధ్య పక్కా కమర్షియల్ జపం చేస్తోంది. ఈ మధ్య తను గీసుకున్న గీత దాటి.. హద్దులు చెరిపి ఎక్స్ పోజింగ్ కు తెగబడింది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా రెచ్చిపోతుంది బ్యూటీ.  అయినా సరే కీర్తీకి పెద్దగా కలిసి రావడంలేదంటున్నారు సినీ జనాలు. 
 


సర్కారు వారి పాట సినిమా  నుంచి కీర్తి సురేష్ లో మార్పు కనిపిస్తోంది. ఈ సినిమా హిట్ అవ్వడంతో కమర్షియల్ ఫార్ములాను గుడ్డిగా ఫాలో అవుతోంది కీర్తి.  అంత కాదు ఈ మధ్య లిమిట్స్ దాటితో హాట్ పర్ఫామెన్స్ లు ఇస్తుంది. ఇక ఈ క్రమంలో కీర్తి సురేష్ కు సబంధించి ఓ న్యూస్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. 

ఇప్పటికే చాలా మంది తారు పెళ్ళి జపం జపిస్తున్నారు. కొంత మంది మాత్రం ఇప్పుడే పెళ్లేంటి అంటున్నారు. కాగా గత వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో కీర్తి సురేష్ పెళ్లి వార్త వైరల్ అవుతుంది. కీర్తి సురేష్ కి పెళ్లి ఫిక్స్ అయ్యిందని.. అబ్బాయి  కూడా రెడీగా ఉన్నాడంటూ న్యూస్ వైరల్ అవుతోంది. త్వరలో ఆమె పెళ్లి చేసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

ఈ నేపథ్యంలో  కీర్తి సురేష్ పెళ్ళి గురించి ఆమె తల్లి  మేనక  సౌత్  మీడియాకు  లీకులు ఇచ్చేసిందట. ఈ విషయం అంతటా తెలియాలని ఇలా చేసిందట మేనక.  అయితే  నిజానికి కీర్తి సురేష్ కి ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేనట్టు తెలుస్తోంది. లైప్ లో ఇంకా సెటిల్ అవ్వాలని పెళ్ళి వాయిదా వేస్తూ వస్తోందట కీర్తి సురేష్. కాని  వాళ్ళ అమ్మ మాత్రం గత రెండు సంవత్సరాల నుంచి ఈమెను పెళ్లి చేసుకోమని టార్చర్ చేస్తున్నారట. 

Keerthi Suresh hot

అంతే రాదే ఇప్పటికే కీర్తి సురేష్ కు తగిన వరుడిని కూడా చూశారట.  చిన్నప్పటి నుంచీ కీర్తికి తెలిసిన ఓ బందువుల అబ్బాయితో ఆమె పెళ్లి ఫిక్స్ చేశారట ఇంట్లో వాళ్లు.. ఇక కీర్తి ఈరోజు యస్ అంటే వెంటనే పెళ్లి చేయడానికి రెడీగా ఉన్నారట. కాని  ఆమె ఇంత వరకూ ఏ విషయం తేల్చ లేదని తెలుస్తోంది. 

ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతే కాదు మహానటి  కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరై ఉంటారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  మరి ఈ బ్యూటీ ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందోచూడాలి. 

Latest Videos

click me!