వైట్ డ్రెస్.. లో ఏంజెల్ లా కీర్తి సురేష్.. చిరునవ్వుతో చంపేస్తున్న మహానటి..

First Published | Oct 15, 2023, 7:32 AM IST

సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది కీర్తి సురేష్. వరుసగా ఫోటో షూట్స్ తో ఫ్యాన్స్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఒకప్పుడు చాలా పద్దతిగా హాద్దులు దాటకుండా.. హోమ్లీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న కీర్తి.. ప్రస్తుతం రోజు రోజుకు హాట్ డోస్ ను పెంచుతూ పోతోంది. 

ఇక తాజాగా కీర్తి సురేష్ వైట్ డ్రెస్ లో చేసిన సందడికి  కుర్రాళ్ల మతులు పోతున్నాయి. స్లీవ్ లెస్ డ్రెస్ లో.. డిఫరెంట్ మేకప్ లోమెరిసిపోయింది మలయాళ భామ. కళ్లజోడుతో కిర్రాక్ ఫోజులిస్తూ.. కనిపించింది. 

కీర్తి అలా కానిపించేసరికి నెటిజన్లు షాక్ అవుతున్నారు. మన మహానటేనా ఈ అమ్మాయి అంటూ.. తెగ లైక్ లు కొడుతున్నారు డిఫరెంట్ గా కామెంట్లుపెడుతున్నారు. కొంత మంది మాత్రం నాటీగళ్ అంటూ కామెంట్ చేస్తున్నారు.


అవ్వడానికి మలయాళ అమ్మాయి అయినా.. అచ్చతెలుగు ఆడపిల్లలా ఉంటుంది కీర్తి. చీరకట్టు కట్టిందంటే.. తెలుగు పిల్ల కాదు అనలేనట్టుగా ఉంటుంది. కీర్తి సురేష్ కూడా తెలుగును అంత అద్భుంగా పలుకుతుంది. చక్కగా మాట్లాడుతుంది. ఇక కీర్తి సురేష్ పై ఈమధ్య రూమర్స్ బాగా ఎక్కువైపోయాయి. ముఖ్యంగా కీర్తి పెళ్ళి చేసుకోబోతుందంటూ వార్తలు ఊపందకున్నాయి. 

కాన్సెప్ట్ సినిమాల నుంచి కమర్షియల్ సినిమాలకు జంప్ అయిన కీర్తి సురేష్ కెరీర్ మీద గట్టిగా దృష్టి పెట్టింది. అయితే సోషల్ మీడియా మాత్రం ఆమెకు త్వరగా పెళ్లి చేసేయాలి అని చూస్తున్నట్టుంది కీర్తిపై రకరకాల వార్తలు నెట్టింట్లో దర్శనం ఇస్తున్నాయి.

ఇక ఇవే కాదు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తో కీర్తి సురేష్ ప్రేమాయణం సాగిస్తుందని.. మరో వార్త ఆమధ్య హల్ చల్ చేసింది. అంతటితో ఆగకుండా.. స్టార్ హీరో విజయ్ తో కీర్తి సురేష్ డేటింగ్ లో ఉందని. విజయ్ తన భార్యకు విడాకులు ఇచ్చి.. కీర్తినిపెళ్లి చేసుకోబోతున్నారని కూడా వార్తలు గుప్పుమన్నాయి. 

రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి చెల్లెలుగా బోళాశంకర్ లో కనిపించింది బ్యూటీ.. కాని ఈసినిమా ప్లాప్ లిస్ట్ లోకి వెళ్లిపోయింది. ఇక ప్రస్తుతం తమిళ్ లో నాలుగు సినిమాలు చేస్తోంది చిన్నది. తెలుగులో మాత్రం ఇంకా ఏ సినిమా కమిట్ అవ్వలేదని సమాచారం. సోషల్ మీడియాలో మాత్రం తెగ సందడి చేస్తోంది బ్యూటీ. 

Latest Videos

click me!