Mrunal Thakur : హీరోతో ప్రేమలో పడ్డ మృణాల్ ఠాకూర్.! జీవిత భాగస్వామిపై క్లారిటీ

First Published | Oct 14, 2023, 5:50 PM IST

మరాఠి ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ చేతినిండా సినిమాలతో ఫుల్ జోష్ లో ఉంది. ఎప్పటికప్పుడు సినిమా అప్డేట్స్ ను అందిస్తోంది. ఇక తాజాగా తన లవ్, చేసుకోబోయే వాడు ఎలా ఉండాలో చెప్పి ఆకట్టుకుంది. ప్రస్తుతం మృణాల్ కామెంట్స్ వైరల్ గా మారాయి. 
 

నార్త్ బ్యూటీ మృణాల్ ఠాకర్ (Mrunal Thakur) అటు హిందీ చిత్రాలతో పాటు ఇటు తెలుగులోనూ వరుసగా ఆఫర్లు అందుకుంటున్న విషయం తెలిసిందే. ‘సీతారామం’ తర్వాత టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా మారి సందడి చేస్తోంది. ప్రస్తుతం ఇక్కడ రెండు సినిమాల్లో నటిస్తోంది. 
 

ఇదిలా ఉంటే.. మృణాల్ ఠాకూర్ సినిమాల పరంగా ఫుల్ దూకుడుగా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఆమె పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. మహారాష్ట్ర, ధులేలో 1992 ఆగస్టు 1న జన్మించింది. ముంబైలో విద్యాభ్యాసం పూర్తి చేేసుకుంది. గ్రాడ్యుయేషన్ తర్వాత సినీ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
 


తాజాగా మృణాల్ ఠాకూర్ తన లవ్ లైఫ్ ను కూడా రివీల్ చేసింది. రీసెంట్ ఇంటర్వ్యూలో రిలేషన్ షిప్ పై మృణాల్ కు ప్రశ్న ఎదురైంది. దీంతో మృణాల్ ఆసక్తికరంగా బదులిచ్చింది. ‘హాలీవుడ్ హీరో కీను రీవ్స్ అంటే తనకు చాలా ఇష్టమని  చెప్పింది. చిన్నప్పుడే అతన్ని చూసి ప్రేమలో పడ్డానని తెలిపింది. 
 

అయితే తనది కేవలం వన్ సైడ్ లవ్ మాత్రమేనని పేర్కొంది. కీను రీవ్స్ లాంటి వ్యక్తి తన జీవిత భాగస్వామిగా రావాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చింది.’. మృణాల్ కామెంట్స్ కు అభిమానులు, నెటిజన్లలో ఆసక్తికరంగా మారింది. కాబోయే భర్తపై క్లారిటీ ఇవ్వడంతో ఖుషీ అవుతున్నారు. 
 

ఇక ప్రస్తుతం ఆమెకు పెళ్లి, రిలేషన్ షిప్ కు సమయం లేదని, పూర్తి టైమ్ కెరీర్ పైనే పెట్టినట్టు చెప్పుకొచ్చింది. ఆ విధంగానే నడుచుకుంటోంది. హిందీ, తెలుగులో వరుసగా ఆఫర్లు అందుకుంటూ వస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో నాని సరసస ‘హాయ్ నాన్న’,  విజయ్ దేవరకొండ సరసన Vd13తో నటిస్తూ బిజీగా ఉంది. 

అలాగే హిందీలో మూడు చిత్రాలు చేస్తోంది. చివరిగా ‘లస్ట్ స్టోరీస్ 2’తో ఈ ముదుగ్గుమ్మ షాకింగ్ పెర్ఫామెన్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘ఆంఖ్ మిచోలీ’, ‘పూజా మేరీ జాన్‘, ‘పిప్పా’ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. త్వరలో కోలీవుడ్ లోనూ అడుగుపెట్టబోతున్నట్టు తెలుస్తోంది. 

Latest Videos

click me!