వేరే ఇండస్ట్రీ నుంచి సినీ రంగంలోకి వచ్చిన నటి కయదు లోహర్, ప్రతి పాత్రకు చాలా కష్టపడి, పూర్తి ప్రిపరేషన్‌తో కెమెరా ముందుకు వస్తారు. ఆమె గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి.
కయదు లోహర్ మాతృభాష నేపాలీ. అస్సాంలో పుట్టి పెరిగిన ఈమె, ఆ తర్వాత పుణెకు షిఫ్ట్ అయ్యారు. ఆమె కుటుంబానికి నేపాల్‌తో సంబంధాలున్నాయి.
28
‘ఫ్రెష్ ఫేస్’గా ఎంపిక!
కయదు మోడలింగ్ జర్నీ కూడా చాలా ఆసక్తికరంగా మొదలైంది. ఓ పోటీలో 'ఫ్రెష్ ఫేస్'గా ఎంపికయ్యాక, ఆమెకు మోడలింగ్ అవకాశాలు వచ్చాయి. అక్కడి నుంచి మెల్లగా సినీ రంగం వైపు అడుగులు వేశారు.
38
ముగిల్‌పేట తో సినీ రంగ ప్రవేశం
కయదు లోహర్ 2021లో కన్నడ సినిమా 'ముగిల్‌పేట'తో సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత సౌత్ ఇండియా సినిమాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు.
కయదుకు ఫిట్‌గా ఉండటమంటే చాలా ఇష్టమట. తన ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి స్విమ్మింగ్, డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తానని ఆమె చెప్పారు.
58
'ప్యారడైజ్'లో సుబ్బలక్ష్మి
తెలుగులో 'అల్లూరి' సినిమాతో కయదు లోహర్ పరిచయమయ్యారు. ఆ తర్వాత 'డ్రాగన్' సినిమాతో మరింత గుర్తింపు పొందారు. ఇప్పుడు 'ప్యారడైజ్'లోని సుబ్బలక్ష్మి పాత్రపై అంచనాలు పెరిగాయి.
68
తప్పనిసరిగా వర్క్‌షాప్
ప్రతి సినిమాలోని పాత్ర కోసం కయదు లోహర్ తప్పనిసరిగా వర్క్‌షాప్ చేస్తారు. ఇదే ఆమె నటన శైలిలోని ప్రత్యేకత. పాత్రపై పూర్తి నమ్మకం, ఆత్మవిశ్వాసం వచ్చాకే సెట్‌లోకి అడుగుపెడతారట. ముఖ్యంగా తనకు తెలియని భాషలో నటించేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉంటానని కయదు తెలిపారు.
78
కొత్త సినిమా ఒప్పుకునే ముందు..
కొత్త సినిమా ఒప్పుకునే ముందు, కథలో తన పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉందో కయదు చూసుకుంటారట. తన పాత్రకు మంచి స్కోప్ ఉంటే, అది పెద్ద బడ్జెట్ సినిమానా లేదా చిన్నదా అని అస్సలు ఆలోచించనని ఆమె స్పష్టం చేశారు.
88
కయదు లోహర్ ఫాలో అయ్యే ఫార్ములా
సినిమాలను ఎంచుకోవడంలో కయదు లోహర్ ఫాలో అయ్యే ఫార్ములా ఇదే. 'ప్యారడైజ్'లో సుబ్బలక్ష్మిగా ఆమె ఎలా మెప్పిస్తుందో చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.