ఎపిసోడ్ ప్రారంభంలో కావ్య తల్లిదండ్రులని ఫంక్షన్ కి పిలవద్దు అంటుంది అపర్ణ. నీకు కావాలంటే నీ కొడుకు ఫంక్షన్ కి పిలువకు అంతేకానీ నా కొడుకు ఫంక్షన్ కి పిలవద్దని నువ్వు చెప్పడం ఏమిటి అంటూ పంతం కొద్దీ కనకానికి ఫోన్ చేసి నిశ్చితార్థానికి పిలుస్తుంది రుద్రాణి. స్వప్న కి కూడా రేపే నిశ్చితార్థం అని మనసులో అనుకొని బయటకు మాత్రం రేపు ఇంట్లో పూజ ఉందండి.