హీరోయిన్ డింపుల్ హయతి, ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే మధ్య వివాదం సంచలనంగా మారింది. పార్కింగ్ ప్రదేశంలో డింపుల్ హయతి.. రాహుల్ హెగ్డే కారుని కాలుతో తన్నడం, దురుసుగా ప్రవర్తించినట్లు రాహుల్ కారు డ్రైవర్ కేసు నమోదు చేయగా ఇది వివాదంగా మారింది. ఇరువురు తమ తమ వాదనలని వినిపిస్తున్నారు.
తాను ఎలాంటి తప్పు చేయలేదని. అమ్మాయిని కాబట్టి కావాలనే టార్గెట్ చేస్తున్నారు అని డింపుల్ హయతి వాదిస్తోంది. తన లాయర్ తో వాదనలు వినిపిస్తోంది. అయితే ఈ వివాదం ఎంత దూరం వెళుతుందో చూడాలి.
ఈ వివాదం మరిచిపోక ముందే డింపుల్ హయతి ఇంట్లో మరో కొత్త సంఘటన చోటు చోటు చేసుకుంది. హైదరాబాద్ లోని జర్నలిస్ట్ కాలనీలో ఓ అపార్ట్మెంట్ లో డింపుల్ హయతి నివాసం ఉంటోంది. ఆమె నివాసం ఉంటున్న ఫ్లాట్ లోకి ఇద్దరు అపరిచిత వ్యక్తులు ప్రవేశించే ప్రయత్నం చేశారు.
అక్కడ ఉన్న పనిమనిషి ఆ ఇద్దరినీ వెంబడించే ప్రయత్నం చేసింది. కుక్క కూడా వారిద్దరిని లిఫ్ట్ వరకు తరిమిందట. వెంటనే 100 కి డయల్ చేయడంతో జూబ్లీ హిల్స్ పోలీసులు రంగంలోకి దిగి ఆ అపరిచితులని అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరిలో రాజమండ్రికి చెందిన వారుగా గుర్తించారు. వారిలో సాయిబాబా అనే వ్యక్తి, శృతి అనే అమ్మాయి ఉన్నారు.
తామిద్దరం డింపుల్ హయతి అభిమానులం అని.. ఇటీవల జరిగిన సంఘటన వల్ల ఆమెని పరామర్శించేందుకు వచ్చినట్లు పోలిసుల విచారణలో తెలిపారు. వారిద్దరూ అనుమానాస్పద వ్యక్తులు కాదని పోలీసులు భావించడంతో డింపుల్ హయతికి సమాచారం ఇచ్చి విడిచిపెట్టినట్లు తెలుస్తోంది. గురువారం రాత్రి ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది.
ఖిలాడీ, రామబాణం లాంటి చిత్రాల్లో హీరోయిన్ గా డింపుల్ కి ఆఫర్స్ వచ్చినప్పటికీ ఆ రెండు చిత్రాలు డిజాస్టర్ గా నిలిచాయి. దీనితో డింపుల్ హయతి తనని తాను నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇంతలో పోలీస్ అధికారితో వివాదంలో చిక్కుకుంది.