మరోవైపు కావ్య వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అప్పు, కళ్యాణ్. వాళ్లకి కరెక్ట్ అడ్రస్ చెప్పావా అంటాడు కళ్యాణ్. కరెక్ట్ అడ్రసే చెప్పాను కానీ మనం ఇక్కడ ఉండొద్దు అంటుంది అప్పు. ఎందుకు అని అడుగుతాడు కళ్యాణ్. ఇక్కడ మీ అన్నయ్య మనల్ని చూస్తే మనమే ఏదో ప్లాన్ చేసాం అనుకుంటాడు అందుకే పక్కకు పోయి నిల్చుందాం అనటంతో ఇద్దరూ పక్కకి వెళ్ళిపోతారు.