ఎపిసోడ్ ప్రారంభంలో కోపంగా ఉంటాడు యష్. ఆ కోపానికి కారణం వేద. నీకు తెలియదా ఒక పెళ్లి ముహూర్తం పెట్టించమంటే రెండు పెళ్లి ముహూర్తాలు ఎందుకు పెట్టించావు వాళ్ల పెళ్లి సంగతి మనకెందుకు అంటాడు యష్. మీరు అవన్నీ ఆలోచించకండి చిత్ర, వసంత్ ల పెళ్లి జరిగితే వాళ్ళు ఆనందంగా ఉంటారు. ఎలాగూ ఆరు రోజుల్లో పెళ్లి అయిపోతుంది కాబట్టి అన్ని సమస్యలు తీరిపోతాయి అంటుంది వేద.