నువ్వేమీ బాధపడకు..మన పెళ్లి జరుగుతుంది ఆస్తికి నిన్ను దూరం కానివ్వను అలాగే నేను దూరం చేసుకోను అనుకుంటుంది స్వప్న. ఆ తర్వాత కిందికి వచ్చిన రాహుల్ వెన్నెలతో మాటలు కలుపుతాడు. కళ్యాణ్ ని దగ్గరికి పిలిచి వాళ్ళిద్దరితో కలిపి నువ్వు సెల్ఫీ తీసుకో అంటుంది కావ్య. ఎందుకు వదిన అంటాడు కళ్యాణ్. చెప్తాను ముందు తీసుకో అని కావ్య అనటంతో ఎవరికి అనుమానం రాకుండా అందరితో సెల్ఫీలు తీసుకుంటూ ఆఖరికి రాహుల్, వెన్నెలతో కూడా సెల్ఫీ తీసుకుంటాడు కళ్యాణ్.