సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ, సన్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కావ్య మారన్ తన వెడ్డింగ్ రిసెప్షన్‌కు ముందే ఉద్యోగుల మనసు గెలుచుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్‌తో వివాహం సందర్భంగా సన్ గ్రూప్ ఉద్యోగులకు ఆమె స్పెషల్ గిఫ్ట్స్ ఇచ్చారు. బంగారు ఉంగరాలు, గోల్డ్ కాయిన్స్, చాక్లెట్స్, పెళ్లి పత్రికలను బహుమతిగా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, కావ్య చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ఈ వైరల్ వీడియోల్లో ఉద్యోగులు గిఫ్ట్ బాక్స్‌లు ఓపెన్ చేసి చూడటం కనిపిస్తోంది. ఆ బాక్స్‌లలో పెళ్లి పత్రిక, చాక్లెట్లు, గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి. ఎక్స్ (ట్విట్టర్)లో షేర్ చేసిన ఒక వీడియోలో, ఓ ఉద్యోగి తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడం వినొచ్చు. తమిళనాడులోని సన్ గ్రూప్ ఉద్యోగులకు గోల్డ్ కాయిన్స్ ఇచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని సన్ గ్రూప్ ఉద్యోగులకు బంగారు ఉంగరాలు అందించారు.