సన్ టీవీ నెట్‌వర్క్ కీలక అధికారి అయిన కావ్య మారన్ పెళ్లి, ప్రేమ వ్యవహారంపై చాలాసార్లు వార్తలొచ్చాయి. కానీ, కావ్య మారన్ గానీ, అనిరుధ్ గానీ ఇప్పటివరకు స్పందించలేదు. ఇప్పుడు అనిరుధ్ బంధువే ఈ విషయం చెప్పడంతో అంచనాలు పెరిగాయి. ఈ ఏడాది ఐపీఎల్‌లో కావ్య మారన్ టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్‌కు చేరింది. కానీ, ప్లేఆఫ్స్‌లో ఓడిపోయింది. టోర్నీ మొత్తం టీమ్‌తో ఉండి, ఆటగాళ్లను ఉత్సాహపరుస్తూ కావ్య మారన్ జట్టును అద్భుతంగా నడిపించారు.