OG Universe : ఓజీ 2 కథలో సుభాష్ చంద్రబోస్ ట్విస్ట్.. కరెక్ట్ గా కుదిరితే రికార్డులు బద్దలే ?

Published : Jun 28, 2026, 06:33 PM IST

పవన్ కళ్యాణ్ ఓజీ 2 పై చాలా ఆసక్తిగా ఉన్నారు. ఇటీవలే పవన్ ఓజీ 2 గురించి సుజీత్ తో చర్చించిన సంగతి తెలిసిందే. ఓజీ 2 కథకి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

PREV
15
పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అప్పుడప్పుడూ సినిమాలు కూడా చేస్తున్నారు. గతేడాది పవన్ కళ్యాణ్ నుంచి హరి హర వీరమల్లు, ఓజీ చిత్రాలు వచ్చాయి. ఈ ఏడాది ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ అయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫోకస్ మొత్తం ఓజీ 2పైనే ఉంది. ఓజీ సూపర్ హిట్ కావడంతో ఎలాగైనా ఓజీ 2 కంప్లీట్ చేయాలనే పట్టుదలతో పవన్ ఉన్నారు.

25
ఫుల్ కమిట్మెంట్ తో పవన్ కళ్యాణ్

ఆల్రెడీ ప్రకటన కూడా వచ్చేసింది. డైరెక్టర్ సుజీత్ తో కథా చర్చలు మొదలయ్యాయి. ఓజీ 2 కోసం తాను ఏం అవసరం అయినా చేస్తాను అని పవన్ సుజీత్ కి హామీ ఇచ్చారు. ఓజీ 2 వర్క్ షురూ కావడంతో ఇక మూవీ లాంచ్ కోసమే అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో కథ గురించి కొన్ని లీకులు కూడా మొదలయ్యాయి.

35
ఓజీ 2 కథ ఇదేనా

ఇప్పుడు ఓజీ 2 కథ గురించి వైరల్ అవుతున్న ఆసక్తికర అంశం సుభాష్ చంద్రబోస్. ఓజీ 2 కథలో డైరెక్టర్ సుజీత్ సుభాష్ చంద్రబోస్ అంశాన్ని జోడించినట్లు తెలుస్తోంది. జపాన్ నుంచి ఓజీని వెతుక్కుంటూ వచ్చిన విలన్ కి, గంభీరాకి మధ్య జరిగే యుద్ధమే ఈ చిత్ర కథ అని అంటున్నారు. ఓజీ చిత్ర కథ 1940, 1973, 1993 కాలాలకు సంబంధించినది.

45
కథలో సుభాష్ చంద్రబోస్ సన్నివేశాలు

1940 టైం పీరియడ్ లో వచ్చే సన్నివేశాల్లో సుభాష్ చంద్రబోస్ అంశం కూడా ఉంటుందని అంటున్నారు. కథలో కీలకమైన ట్విస్ట్ కూడా అక్కడే ఉంటుందనేది లేటెస్ట్ టాక్. స్వాతంత్ర పోరాట యోధుడిగా సుభాష్ చంద్రబోస్ కి ఉండే గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

55
అంతా వాళ్ళిద్దరి చేతుల్లోనే

ఆ సన్నివేశాల్ని సుజీత్ కథలో కరెక్ట్ గా చేర్చగలిగితే ఓజీ 2 రికార్డులు బద్దలు కొడుతుంది అని అభిమానులు ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు. మరి సుజీత్, పవన్ కళ్యాణ్ కలసి ఏం చేస్తారో చూడాలి. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా తన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై నిర్మించబోతున్నట్లు టాక్.

Read more Photos on
click me!

Recommended Stories