ఎపిసోడ్ ప్రారంభంలో కళావతి పేరు మీద డిజైనర్ పోస్ట్ కి అపాయింట్మెంట్ ప్రిపేర్ చేయండి అని మేనేజర్ కి చెప్తాడు రాజ్. మేడం పేరు కళావతి కాదు సార్ కావ్య అని చెప్తుంది శృతి. ఆమె కాసి కోపంగా చూస్తాడు రాజ్. సార్ ఇగో హర్ట్ అయినట్లుగా ఉంది అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది శృతి. ఈరోజే కావ్య డిజైన్స్ గురించి ఇంట్లో అందరికీ చెప్పాలి అనుకుంటాడు రాజ్. సీన్ కట్ చేస్తే కావ్య కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అపర్ణ.