Guppedantha Manasu: భర్త ముందు డ్రామా క్రియేట్ చేసిన దేవయాని.. రిషికి వార్నింగ్ ఇచ్చిన వసుధార!

Published : Aug 05, 2023, 07:27 AM ISTUpdated : Aug 05, 2023, 07:29 AM IST

Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి కథ కథనాలతో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. తను ప్రేమించిన వాడు ఎక్కడ ప్రమాదానికి గురవుతాడో అని గారు పడుతున్న ఒక ప్రేమికురాలి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఆగస్టు 5 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

PREV
19
Guppedantha Manasu: భర్త ముందు డ్రామా క్రియేట్ చేసిన దేవయాని.. రిషికి వార్నింగ్ ఇచ్చిన వసుధార!

ఎపిసోడ్ ప్రారంభంలో రిషికి నిజం చెప్పేద్దాం అంటుంది జగతి. పరిశీలి నమ్మడు ఇప్పటికీ పెద్దమ్మని అన్నయ్యని నమ్ముతున్నాడు అంటాడు మహేంద్ర. నువ్వు చెప్పినా కూడా నమ్మడా.. తప్పకుండా నమ్ముతాడు. మనం ఎన్నాళ్ళని రిషికి చెప్పకుండా ఉంటాము, అలా అయితే మనం జీవితకాలం భయపడుతూ బ్రతకాల్సిందే అంటూ కన్నీరు పెట్టుకుంటుంది జగతి.
 

29

అది చూసినా దేవయాని ఎందుకు ఏడుస్తున్నావు, రిషి గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతుంది. ఇంట్లో అందర్నీ పిలుస్తుంది. అందరూ వచ్చిన తర్వాత ఏమైంది అని అడుగుతాడు ఫణీంద్ర. జగతి వాళ్ళకి రిషి ఎక్కడున్నాడో తెలిసినట్లుగా ఉంది అందుకే కన్నీరు పెట్టుకుంటుంది అనే భర్తకి చెప్తుంది దేవయాని. రిషి ఎక్కడున్నాడో తెలిస్తే మేమెందుకు ఇలా ఉంటాము అంటాడు మహేంద్ర.
 

39

మరి ఆ ఏడుపు ఎందుకు అయినా మేమందరం మేము ఉన్నాం కదా రిషికి ఏం కాదు తప్పకుండా తిరిగి వస్తాడు అంటుంది దేవయాని. ఆ మాటలకి కోపంగా అవును రిషి తప్పకుండా తిరిగి వస్తాడు అతను ఎక్కడ ఉన్నా మా ఆశీస్సులు అతనిని ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాయి అంటుంది జగతి. ఎందుకు అలా మాట్లాడుతున్నావు అంటాడు ఫణీంద్ర. రిషి దూరమైన బాధలో ఏదో మాట్లాడుతున్నట్లుగా ఉంది అని టాపిక్ మార్చేస్తుంది దేవయాని.
 

49

మరోవైపు మిషన్ ఎడ్యుకేషన్ ఎలా ప్రమోట్ చేయాలో క్లాస్ తీసుకుంటూ ఉంటాడు రిషి. దీని గురించి మీరు ఇంతకుముందు ఎక్కడైనా వర్క్ చేశారా ఇంత బాగా చెబుతున్నారు  అని అడుగుతాడు పాండ్యన్. అవును చేశాను అని చెప్తాడు రిషి ఆ తర్వాత ఈ ప్రాజెక్టు గురించి మీకు ఏమైనా డౌట్లు ఉంటే వసుధార మేడంని అడగండి ఆవిడకి కూడా ఈ విషయంలో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రిషి.
 

59

రిషి క్లాస్ తీసుకోవటం వసుధార చూస్తుంది. ఆ తర్వాత కోపంగా విశ్వనాథం ఇంటికి వెళుతుంది. ఏంజెల్ పిలుస్తున్న కూడా వినిపించకుండా నేరుగా రిషి గదిలోకి వెళ్లి ఇంత జరుగుతున్నా కూడా మళ్ళీ మీరు ఒంటరిగా తిరుగుతున్నారు ఇదేమి బాగోలేదు అయినా నీ మీద అటాచ్ చేసింది ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి కదా అంటూ  నిలదీస్తుంది. మీరు ఇలా నా గదికి రావడం నన్ను నిలదీయడం ఏమీ బాగోలేదు.
 

69

గతాన్ని అందరికీ తెలిసేలాగా చేయాలనుకుంటున్నారా అయినా నా మీద అటాక్ చేసింది ఎవరో నాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నన్ను కన్నతల్లే మోసం చేసిన తర్వాత నేను దేని గురించి పెద్దగా రియాక్ట్ అవటం లేదు అంటాడు రిషి. అంతలోనే విశ్వనాథం, ఏంజెల్ అక్కడికి వచ్చి ఏం జరిగింది అని కంగారుగా అడుగుతారు. నా మీద ఎటాక్ జరిగిన తర్వాత కూడా నేను బయట తిరుగుతున్నానని మేడమ్ కి కోపం వచ్చింది అంటాడు రిషి.

79

జాగ్రత్తగా ఉండాలి కదా సార్ ఇకమీదట ఇలాంటివి రిపీట్ కానివ్వకుండా చూసుకుంటే మంచిది మీరైనా చెప్పండి సార్ అని విశ్వనాధానికి చెప్తుంది వసుధార. నువ్వు అతడినే కాదు నన్ను కూడా హెచ్చరించావు జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది అంటాడు విశ్వనాథం. నా మీద కేర్ తీసుకుంటున్నందుకు థాంక్స్ ఇంక మీరు బయలుదేరండి అని వెటకారంగా అంటాడు రిషి.
 

89

ఈ మాత్రం విన్నందుకు థాంక్స్ అని వసుధార కూడా అంతే పొగరుగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.ఆ తర్వాత ఆటోలో వెళ్తున్న వసుధారని మధ్యలోనే ఆపి ఆమెతో వాదనకి దిగుతాడు రిషి. నేను ఏమైపోతే మీకెందుకు అయినా వాళ్ళందరూ ముందు నిల తీయటం అవసరమా మన గతం బయటపెట్టడం మీ ఉద్దేశమా అంటూ గొడవ పడతాడు.
 

99

మరి నాకు ఆక్సిడెంట్ అయినప్పుడు నా గురించి ఎందుకు కేర్ తీసుకున్నారు అంటూ వసుధార కూడా చాలా కోపంగా మాట్లాడి ఇంక నేను మీ మాటలు వినదల్చుకోలేదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పొగరు.. ఎక్కడా తగ్గడం లేదు అనుకుంటాడు రిషి. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

click me!

Recommended Stories