కానీ వెనకే ఉన్న స్వప్న ని చూసి అందరూ సంతోషపడుతారు కానీ రుద్రాణి, రాహుల్ మాత్రం ఇంకా షాక్ లోనే ఉండిపోతారు. ఏం జరిగింది అని అడుగుతుంది కనకం. జరిగిందంతా చెప్తుంది కావ్య. కామరాజు తన పేరు బయటపెట్టాడేమో అని టెన్షన్ పడిపోతాడు రాహుల్. కామరాజు తనకే స్వప్నని పెళ్లి చేసుకోవాలనిపించి కిడ్నాప్ చేశాడని చెప్పాడు అని రాజ్ చెప్పటంతో రిలాక్స్ ఫీల్ అవుతాడు రాహుల్.