కత్రీనా, విక్కీ కౌశల్‌ మ్యారేజ్‌ ఫిక్స్... రాయల్‌ వెడ్డింగ్‌కి వేదిక ఎక్కడో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందేనట ?

First Published | Oct 28, 2021, 4:34 PM IST

బాలీవుడ్‌లో మోస్ట్ ప్రామిసింగ్‌ లవ్‌ కపుల్‌ కత్రీనా కైఫ్‌, విక్కీ కౌశల్‌ పెళ్లి రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. ఏకంగా మ్యారేజ్‌ చేసుకోబోతున్నారని, వేదిక కూడా కన్ఫమ్‌ అయ్యిందని, ఎప్పుడు చేసుకోబోతున్నారనే విషయాలు కూడా ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అందులో భాగంగా వీరి వెడ్డింగ్‌ వెన్యూ ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. 
 

కత్రీనా కపూర్‌(Katrina Kaif), విక్కీ కౌశల్‌(Vicky Kaushal) గత కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్నారు. చాలా కాలం రహస్యంగా ఉన్న వీరి ప్రేమ గతేడాది నుంచి బాగా పాపులారిటీ సొంతం చేసుకుంది. వీరిద్దరు పలు ఈవెంట్లలో కలిసి కనిపించడం, బయట కూడా కలిసి తిరగడం, కలిసి ఉన్నప్పుడు చాలా చనువుగా ఉండటం వంటి కారణాలతో వీరిద్దరు ప్రేమలో ఉన్నారనే విషయాన్ని కన్ఫమ్‌ చేసింది బాలీవుడ్‌ మీడియా. దీనికి తోడు ఇటీవల విక్కీ నటించిన `సర్దార్‌ ఉద్ధమ్‌` చిత్ర ప్రీమియర్స్ లో వీరిద్దరు కలిసి కనిపించారు. రెడ్‌ కార్పెట్‌ సమయంలో గట్టిగా వాటేసుకున్నారు. ఆ సమయంలో క్లోజ్‌గా మూవ్‌ అవడంతో ఆల్మోస్ట్ వీరిద్దరి డేటింగ్‌ విషయం కన్ఫమ్‌ చేసుకుంటున్నారు గాసిప్‌ రాయుళ్లు.

ఇదిలా ఉంటే ఇప్పుడు వీరి మ్యారేజ్‌ వార్తలు ఊపందుకున్నాయి. త్వరలోనే Katrina Kaif, Vicky Kaushal Wedding చేసుకోబోతున్నారనే వార్తల వైరల్‌ అవుతున్నాయి. బాలీవుడ్‌ మీడియాలో, సోషల్‌ మీడియాలో కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే అందులో భాగంగా ఇప్పుడు వీరి వెడ్డింగ్‌ టైమ్‌, వెడ్డింగ్‌ వెన్యూ కూడా కన్ఫమ్‌ అయినట్టు తెలుస్తుంది. ఈ విషయాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. అయితే వెన్యూ విషయం మాత్రం ఇప్పుడు ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేస్తుంది. 
 


విక్కీ కౌశల్‌, కత్రీనా కపూర్‌ ల పెళ్లి డిసెంబర్‌ ఫస్ట్ వీక్‌లో జరగబోతుందట. ఈ ఏడాది డిసెంబర్‌లోనే వీరిద్దరు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు రాజస్థాన్‌లోని రత్నాంబోర్‌ నేషనల్‌ పార్క్ కి దగ్గరలోని సవై మదుపూర్‌లోని సిక్స్ సెన్సెస్‌ ఫోర్ట్ బర్వారాలో విక్కీ-కత్రీనా మ్యారేజ్‌ ఫిక్స్ అయ్యిందట. చాలా గ్రాండ్‌గా, లావిష్‌గా తమ వెడ్డింగ్‌ సెర్మనీ ఉండేలా ప్లాన్‌ చేసుకుంటున్నారని బాలీవుడ్‌ సమాచారం. 
 

తమ మ్యారేజ్‌కి సంబంధించిన దుస్తులను, డిజైనింగ్‌ వేర్‌ని కూడా ఇప్పటి నుంచే స్పెషల్‌గా రెడీ చేయిస్తున్నారట. పెళ్లి దుస్తులను ప్రముఖ డిజైనర్‌ సభ్యసాచి రూపొందిస్తున్నారని టాక్‌. తమ దుస్తులకు అవసరమైన ఫ్యాబ్రిక్స్ ఎంపిక చేసే పనిలో వీరిద్దరు ఉన్నారని టాక్. అయితే ఇందులో నిజమెంతా అనేది కూడా సస్పెన్స్ గా మారింది. ఓ ప్రాజెక్ట్ కోసం ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయని, పెళ్లి వార్తల్లో నిజం లేదనే టాక్‌ కూడా వినిపిస్తుంది.

ఇదిలా ఉంటే కత్రీనా, విక్కీ పెళ్లి చేసుకోబోతున్న వేదిక కూడా ఇప్పుడు వార్తల్లో నిలుస్తుంది. సిక్స్ సెన్సెస్‌ ఫోర్ట్ బర్వారా 14వ శతాబ్దం కాలం నాటిదని, రాజస్థాన్‌ రాయల్స్ ఫ్యామిలీ దీన్ని నేటి అవసరాలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దారని, చాలా రాయల్‌ లుక్‌లో దీన్ని మోడ్రనైజ్‌ చేసినట్టు సమాచారం. ఈ పోర్ట్ లో రెండు టెంపుల్స్ కూడా ఉన్నాయట. 700ఏళ్ల నాటి అందాలకు ఈ కోట ప్రతిబింబంగా నిలుస్తుందని అంటున్నారు. ట్రెడిషనల్‌ సెర్మనీలకు, రాయల్‌ వెడ్డింగ్‌లకు ఇది బెస్ట్ లొకేషన్‌గా నిలుస్తుందని అంటున్నారు.
 

కత్రీనా కైఫ్‌ విక్కీ కంటే ముందే.. ఇతర హీరోలతో డేటింగ్‌ చేసింది. సల్మాన్‌ ఖాన్‌తో డీప్‌ లవ్‌లో ఉన్న ఆమె కొన్ని రోజులకు బ్రేకప్‌ చెప్పుకున్నారు. ఆ తర్వాత గ్యాపిచ్చిన క్యాట్‌.. రణ్‌బీర్‌ కపూర్‌తో రొమాన్స్ చేసింది. వీరిద్దరు బీచ్‌లు, పబ్‌లో, విదేశాలకు వెకేషన్‌ కూడా వెళ్లారు. ఆయా ఫోటోలు సోషల్‌ మీడియాలో లీక్‌ అయి సంచలనం సృష్టించాయి. కొన్ని రోజులకు బ్రేకప్‌ చెప్పుకున్న ఈ జంట ఇప్పుడు ఎవరికి వాళ్లు మరో కొత్త జోడీలతో బిజీగా ఉన్నారు. అలియాతో రణ్‌బీర్‌ మూవ్‌ అవుతుండగా, విక్కీతో కత్రీనా డేటింగ్‌లో ఉందనేది బాలీవుడ్‌ టాక్. 
 

ఇక ప్రస్తుతం కత్రీనా కైఫ్‌.. నటించిన `సూర్యవంశీ` చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. అక్షయ్‌ కుమార్‌ ఇందులో హీరో. దీంతోపాటు `ఫోన్‌ బూత్‌`, `టైగర్‌3` చిత్రాల్లో నటిస్తుంది. సల్మాన్‌తో మరోసారి జోడి కడుతుంది కత్రీనా. మరోవైపు విక్కీ కౌశల్‌.. ఇప్పుడు `ది గ్రేట్ ఇండియన్‌ ఫ్యామిలీ`, `మిస్టర్‌ లేలే` చిత్రాలు చేస్తున్నారు. ఇటీవల `సర్దార్‌ ఉద్ధమ్‌` చిత్రంతో మంచి విజయాన్నిసాధించిన విషయం తెలిసిందే. 

Latest Videos

click me!