`జబర్దస్త్` మానేయడానికి కారణం బయటపెట్టిన హైపర్‌ ఆది.. షో వెనుక అంత టార్చర్‌ ఉందా?

Published : Apr 22, 2024, 04:58 PM ISTUpdated : Apr 22, 2024, 06:15 PM IST

స్టార్‌ కమెడియన్‌ హైపర్‌ ఆది.. సుడిగాలి సుధీర్‌ టీమ్‌తో చేసిన కామెడీ అంతా ఇంతా కాదు. అయితే సడెన్‌గా షోని మానేశారు. తాజాగా దీనిపై స్పందించారు ఆది.   

PREV
17
`జబర్దస్త్` మానేయడానికి కారణం బయటపెట్టిన హైపర్‌ ఆది.. షో వెనుక అంత టార్చర్‌ ఉందా?

హైపర్‌ ఆది.. `జబర్దస్త్`లో తన కామెడీ స్కిట్లతో పాపులర్‌ అయ్యాడు. తనదైన పంచ్‌లతో విరుచుకుపడుతూ ఆద్యంతం నవ్వులు పూయించాడు. అనతి కాలంలోనే స్టార్‌ కమెడియన్‌గా మారిపోయాడు. కొన్నేళ్లపాటు బుల్లితెర ఆడియెన్స్ ని అలరిస్తూనే ఉన్నారు. హైపర్‌ ఆది ఉన్నాడంటే నవ్వులు పూయాల్సిందే అనేట్టుగా ఆయన స్కిట్లు ఉండేవి. అలాంటి పేరు తెచ్చుకున్నాడు. 

27

హైపర్‌ ఆది రైటర్‌గా కూడా. తనే తన స్కిట్లని స్యయంగా రాస్తాడు. అందుకే ఆయన కెప్టెన్‌ అయ్యాడు. కొన్నేళ్లపాటు జబర్దస్త్ టీమ్‌ కెప్టెన్‌గా రాణించారు. వినోదాన్ని పంచడంలో సక్సెస్‌ అయ్యాడు. అభి టీమ్‌ నుంచి ప్రారంభమైన ఆయన జర్నీ గతేడాది వరకు విజయవంతంగా `జబర్దస్త్ `లో సాగింది. 
 

37

 ఆది జర్నీ అభి టీమ్‌లో మెంబర్‌గా స్టార్ట్ అయ్యింది. కొన్ని ఎపిసోడ్ల వరకు వెనకాల సైలెంట్‌గా నిలబడే స్కిట్ల నుంచి పది పదిహేను స్కిట్ల తర్వాత డైలాగ్ లు అందించే పాత్రకి షిఫ్ట్ అయ్యాడు. అభి టీమ్‌లో సెకండ్‌గా ఉన్న ఫణి సినిమాల కోసం వెళ్లడంతో మిగిలిన ఇద్దరు కమెడియన్లు లేడీ గెటప్‌లు వేయడంతో హైపర్‌ ఆదికి డైలాగ్‌లు చెప్పే అవకాశం వచ్చింది. 
 

47

ఆ తర్వాత డైలాగ్‌లు అందించడంతోపాటు నవ్వులు పూయించేలా పంచ్‌లు, సెటైర్లతో రెచ్చిపోవడంతో త్వరలోనే కెప్టెన్‌గా అవకాశం వచ్చింది. దీంతో అప్పట్నుంచి ఏమాత్రం తగ్గకుండా పంచ్‌లతో విరుచుకుపడుతూ ఆకట్టుకుంటున్నారు. నవ్వులు పూయించడంలో తనదే పై చేసే అనేలా స్కిట్లు చేశాడు ఆది. సుడిగాలి సుధీర్‌ టీమ్‌తో కలిసి ఆయన చేసిన కామెడీ, రచ్చ నెక్ట్స్ లెవల్లో ఉండేదంటే అతిశయోక్తి కాదు. 

57

అయితే సడెన్‌గా ఆయన గతేడాది జబర్దస్త్ నుంచి బయటకు వచ్చాడు. సుడిగాలి సుధీర్‌, హైపర్‌ ఆది ఇద్దరూ ఒకేసారి తప్పుకున్నారు. ఆసమయంలోనే అనసూయ కూడా తప్పుకుంది. చాలా మార్పులు జరిగాయి. దీంతో షోకి కూడా క్రేజ్‌ తగ్గింది. జడ్జ్ లు మారుతూ వస్తున్నారు. ఆ కామెడీ ఇప్పుడు మిస్‌ అయిన ఫీలింగ్‌ కలుగుతుంది. 
 

67
Hyper aadi , PawanKalyan

హైపర్‌ ఆది `జబర్దస్త్` ఎందుకు మానేశాడనేది పెద్ద సస్పెన్స్. తాజాగా దీనిపై ఓపెన్‌ అయ్యాడు ఆది. ఎందుకు వదులుకోవాల్సి వచ్చిందో తెలిపారు. ఆదికి సినిమా ఆఫర్లు వస్తున్నాయి. దీంతో అక్కడ బిజీ అవుతున్నారు. దీని కారణంగా జబర్దస్త్ చేయడం కష్టంగా మారుతుందట. పైగా తనే స్కిట్లు రాస్తారట. షూటింగ్‌ల వల్ల తనకు టైమ్‌ కుదరడం లేదని అందుకే మానేసినట్టు తెలిపారు. జబర్దస్త్ షోలో ఉంటే మరే ఇతర పని చేయలేమని, దానికే పూర్తి టైమ్‌ ఇవ్వాల్సి వస్తుందని, అందుకే వదిలేసినట్టు తెలిపారు ఆది. 

77

జబర్దస్త్ స్కిట్‌ రాయడానికి ఒక రోజు, ప్రాక్టీస్‌ చేయడానికి మిగలిన రోజులు పోతున్నాయని, సినిమాలు చేయలేకపోతున్నా అని, అందుకే మానేసిన్టు తెలిపారు.  దీంతోపాటు మరో కారణం వెల్లడించారు ఆది. స్కిట్లు రాయండం చాలా కష్టం అని, మొత్తం అందులోనే ముగునిపోవాల్సి ఉంటుందని, మరో ప్రపంచాన్ని చూడలేకపోతామని, అదొక పెద్ద టార్చర్‌ అని, అందుకే గ్యాప్‌ తీసుకున్నట్టు తెలిపారు. ప్రతి ఆరు నెలకు కొన్ని రోజు గ్యాప్‌ తీసుకుంటేనేస్కిట్లు రాయగలం అని చెప్పారు. ప్రస్తుతం ఆది `శ్రీదేవి డ్రామా కంపెనీ` చేస్తున్నాడు. ఇది స్మాంటినీయస్‌గా పంచ్‌లు వేసి నవ్వించే షో, దీనికి పెద్ద కష్టపడాల్సిన పనిలేదని తెలిపారు.  
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories