యంగ్‌ హీరోతో కృతి సనన్‌ డేటింగ్‌, త్వరలో పెళ్లి?.. అసలు విషయం బయటపెట్టిన యంగ్‌ స్టార్‌

First Published | Nov 5, 2024, 10:09 PM IST

ప్రభాస్‌తో `ఆదిపురుష్‌`లో నటించి మెప్పించిన కృతి సనన్‌ ప్రేమలో ఉందనే రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. యంగ్ హీరోతో ఆమె డేటింగ్‌ లో ఉందనే రూమర్స్ ఉన్న నేపథ్యంలో తాజాగా దీనిపై స్పందించారు. 

మహేష్‌ బాబు `వన్‌ నేనొక్కడినే`తో ఇండస్ట్రీకి పరిచయమైన కృతి సనన్‌ బాలీవుడ్‌లోకి వెళ్లి బిజీ అయ్యింది. ఇటీవల ఆమె ప్రభాస్‌తో `ఆదిపురుష్‌`లో కలిసి నటించింది. వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు వచ్చాయి. కానీ అది నిజం కాదని తేలిపోయింది. ఈ నేపథ్యంలో మరో యంగ్‌ హీరోతో ప్రేమలో ఉందని, పెళ్లి కూడా చేసుకోబోతుందనే వార్తలు వచ్చాయి. 

 `భూల్ భులైయా 3` విజయాన్ని అందుకున్న కార్తీక్ ఆర్యన్ తో ఆమె ప్రేమలో ఉన్నట్టు వార్తలొస్తున్నాయి.  కార్తీక్‌ ఆర్యన్‌  రూహ్ బాబాగా నటించిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో విద్యాబాలన్‌తో కలిసి ఆయన  కపిల్ షోలో పాల్గొన్నారు. ఈ షోలో వీరి సందడి వేరే లెవల్‌లో సాగింది.  అనంతరం మ్యాషేబుల్ ఇండియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తీక్ తన రిలేషన్‌షిప్ స్థితి గురించి స్పందించాడు. 


నేను సింగిల్, ఎవరికీ లైవ్ లొకేషన్ పంపాల్సిన అవసరం లేదు. నేను ప్రస్తుతం ఏ డేటింగ్ యాప్‌లలోనూ లేను. `చందు ఛాంపియన్‌` కి సంబంధించిన షూటింగ్ లో బిజీగా ఉన్న నేపథ్యంలో తనకు టైమ్‌ దొరకడం లేదు అని, డేటింగ్‌ చేసే టైమ్‌ లేదని చెప్పాడు కార్తీక్‌.  

నేను సినీ పరిశ్రమలోకి వచ్చిన తర్వాత గత రెండు సంవత్సరాలుగా కఠినమైన జీవనశైలిని పాటించాల్సి వచ్చింది.  `భూల్ భులైయా 3` షూటింగ్ పూర్తి చేయడం నాకు పెద్ద సవాలుగా ఉంది. అందువల్ల, వీటి గురించి ఆలోచించడానికి సమయం లేకుండా బిజీగా ఉన్నా అని తెలిపారు కార్తీక్‌. 

ఇటీవల `భూల్ భులైయా 3` చిత్ర బృందం కపిల్ షోలో పాల్గొంది.  నటి విద్యా బాలన్ మాట్లాడుతూ, 'షూటింగ్ సమయంలో కార్తీక్ ఎప్పుడూ ఫోన్‌లోనే ఉండేవారు. అప్పుడు 'మీ టూ, మీ టూ' అని వినిపించేది. అది ఎవరి పేరు?' అని అడిగారు, కానీ కార్తీక్‌ దాటవేయడం విశేషం. దీంతో ఆ అనుమానాలు మరింతగా పెంచేశాడు కార్తీక్‌. దీనిపై మున్ముందు క్లారిటీ రానుంది. 

అనీస్ బజ్మీ దర్శకత్వం వహించిన `భూల్ భులైయా 3` చిత్రంలో త్రిప్తి డిమ్రి, మాధురి దీక్షిత్, రాజ్‌పాల్ యాదవ్, శ్వేతా తివారీ, విజయ్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం గత వారం విడుదలై ఇప్పటికే 123.5 కోట్లు వసూలు చేసింది. భారీ కలెక్షన్ల దిశగా వెళ్తుంది. 

Latest Videos

click me!