హీరో గోపీచంద్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సినిమా ఏదో తెలుసా..?

First Published | Nov 5, 2024, 8:09 PM IST

హీరోగా సాలిడ్ హిట్ కోసం ఎదరు చూస్తున్నాడు గోపీచంద్. వరుస హిట్లు అందుకున్న ఈ హీరో ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయాడు. అయితే తాజాగా గోపీచంద్ కు సబంధించిన ఓ విషయం నెట్టింట వైరల్ అవుతోంది. విషయం ఏంటంటే..? 

ఇండస్ట్రీలోకి సుడిగాలిలా దూసుకువచ్చి.. ఆతరువాత సైలెంట్ అయ్యాడు హీరో గోపీచంద్. మాస్ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ హీరో...  ఫస్ట్ సినిమా తొలివలపుతో దెబ్బతిన్నాడు. హీరోగా కలిసి రావడంలేదని విలన్ అవతారం ఎత్తిన గోపీచంద్. వరుసగా జయం, నిజం, వర్షం సినిమాల్లో పవర్ ఫుల్ విలన్ గా అలరించాడు. 

Also Read: గంగవ్వ కంటే నాగార్జున పెద్దవాడా..? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా..?
 

హీరోలకు సమానంగా ఈమూడు సినిమాల్లో గోపీచంద్ కు ఇమేజ్ ఉంటుంది. దాంతో ఇండస్ట్రీలో గోపీచంద్ పేరు మారుమోగిపోయింది. ఆతరువాత ధైర్యం చేసి..మళ్ళీ హీరోగా సినిమాలు మొదలు పెట్టిన గోపీచంద్ కు  యజ్ఞం సినిమా వరంలా దొరికింది. ఈసినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు యంగ్ హీరో. 

ఇక వరుసగా సినిమా ఆఫర్లు వచ్చాయి విలన్ గా కాదు..హీరోగా. హిట్లు ప్లాప్ తో పనిలేకుండా వరుస పెట్టి ఓ డజన్ సినిమాలు చేసుకుంటూ వెళ్ళాడు గోపీచంద్. కాని రాను రాను ప్లాప్ లు ఎక్కువ అవ్వడంతో.. సాలిడ్ హిట్ కోసం ఎదరు చూస్తున్నాడు హ్యాండ్సమ్ హీరో. కాగా తాజాగా గోపీచంద్ నటించిన విశ్వం సినిమా రిలీజ్ అయ్యి పర్వాలేదు అనిపించుకుంది. 

Also Read: రాజమౌళి కి బాగా కోపం వస్తే ఏం చేస్తాడో తెలుసా..?


ఈక్రమంలో గోపీచంద్ కు సంబంధించిన ఓ విషయం వైరల్ అవుతోంది. గోపీచంద్ ఓ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడని ఎవరికైనా తెలుసా...? అవును గోపీచంద్ దేశంలో దొంగలు పడ్డారు సినిమాలో బాలనటుడిగా కనిపించాడు. దీనికి కారణం గోపీచంద్ తండ్రి టీ కృష్ణ గొప్ప దర్శకుడు కావడమే. ఆయన టాలీవుడ్ లో అద్భుతమైన సూపర్ హిట్ సినిమాలు చేశారు. 

Also Read: సమంతతో కలిసి నాగార్జునను మోసం చేసిన నాగచైతన్య,

అన్నీ దేశానికి ఉపయోగపడే సినిమాలు. గోపీచంద్ టీ కృష్ణ తనయుడని చాలా తక్కువ మందికి తెలుసు. ఆ రోజుల్లో  కృష్ణ నేటి భారతం, దేశంలో దొంగలు పడ్డారు, దేవాలయం, వందేమాతరం, ప్రతిఘటన ,  అర్ధరాత్రి స్వతంత్రం, రేపటి పౌరులు వంటి అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించాడు. ఈసినిమాలు ఫిల్మ్ ఇండస్ట్రీని వణించాయి. 

బాక్సాఫీస్ ను శేక్ చేశాయి. అయితే అంత గొప్ప దర్శకుడు అనారోగ్యంతో 36 ఏళ్ళకే మరణించాడు. ఇక తండ్రిని కోల్పోయిన గోపీచంద్.. ఎన్ని ఇబ్బందులు పడింది ఆయన రీసెంట్ గా వెల్లడించారు. అంత పెద్ద దర్శకుడి గొడుకు అయినా.. అవకాశాల కోసం ఆల్బం పట్టుకుని స్టూడియో గేట్లు పట్టుకు తిరిగే వాడట. 

Also Read: 3 గంటల్లో 21 పాటలు మ్యాజిక్ లో రికార్డ్ క్రియేట్ చేసిన ఇళయరాజా

దేశంలో దొంగలు పడ్డారు సినిమాలో గోపీచంద్ బాలనటుడిగా అద్భుంగా నటించారు ఆతరువాత వెంటనే  రేపటి పౌరులు సినిమాలో కూడా గోపీచంద్ ని నటింపచేయాలని అనుకున్నాడట. ఈ సినిమా చిన్న పిల్లల మీద తీసిన సంగతి తెలిసిందే. అయితే డేట్స్ ఎక్కువ కావాల్సి ఉండగా, గోపీచంద్ చదువుకి ఆటంకం కలిగే పరిస్థితి ఉన్నందున తన నిర్ణయం వెనక్కి తీసుకున్నారట టీ కృష్ణ.
 

Gopichand, Srinu vytla, Viswam , OTT,

 ఇక గోపీచంద్ రీసెంట్ గానే ‘విశ్వం’ చిత్రంతో సూపర్ హిట్ ని అందుకున్న సంగతి తెలిసిందే. చాలా కాలం నుండి వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న గోపీచంద్ కి ఈ చిత్రం కాస్త ఉపశమనం కలిగించింది. రీసెంట్ గానే ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేసారు.

Latest Videos

click me!