Karthika Deepam 2 Today Episode:జ్యోను ఇరికించిన దీప-ఛీ కొట్టిన సుమిత్ర-నోరు జారిన పారు-కాంచన కోపం

Published : May 08, 2026, 11:19 AM IST

Karthika Deepam 2 Today Episode (మే 8వ తేదీ)లో జ్యో చేతిలో 100 రూపాయలు పెట్టిన సూరజ్. నువ్వొక దొంగవి అన్న జ్యో. సుమిత్ర ముందు జ్యో నిజ స్వరూపం బయటపెట్టిన దీప. ఛీ కొట్టిన సుమిత్ర. ఫ్రస్టేట్ అయిన జ్యో. నోరు జారిన పారు. ఈ రోజు ఇంకా ఏం జరిగిందంటే...  

PREV
18
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ శుక్రవారం ఎపిసోడ్ లో ఆటో ఆపి దిగుతాడు సూరజ్. ఏంటి దిగిపోతున్నావు. నువ్వు జెంటిల్ మెన్ అనుకున్నాను. కానీ నువ్వొక దొంగవి. నిన్ను ఊరికే వదిలిపెట్టను.. నా ఫోన్ కారు కీస్ ఇవ్వు అంటుంది జ్యోత్స్న. మనం ఎలా ఉంటే ఎదుటివాళ్లు అలాగే కనిపిస్తారని కౌంటర్ ఇస్తాడు సూరజ్. కాసేపు వాదన తర్వాత ఫోన్, కారు కీ ఇచ్చి.. జ్యోత్స్న చేతిలో వంద రూపాయలు పెట్టి వెళ్లిపోతాడు. నా ఈగోని దెబ్బకొట్టావ్. నీతో కన్నీళ్లు పెట్టించకపోతే నా పేరు జ్యోత్స్నే కాదు అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. ఆ తర్వాత కారు తీసుకొని ఇంటికి వెళ్తుంది.

28
నాకు నచ్చినట్లు తిరుగుతా..

జ్యోత్స్న ఇంటి లోపలికి వెళ్లేటప్పుడు దీప కాల్ చేస్తుంది. ఏంటీ నువ్వు ఫోన్ చేశావ్ అని అడుగుతుంది. ఎక్కడున్నారు అమ్మాయిగారు, ఇంకా ఇంటికి రాలేదని తెలిసింది. ఇంట్లో వాళ్లు కంగారు పడతారు కదా అంటుంది దీప. నాకు నచ్చినట్లు తిరుగుతా. అడగడానికి నువ్వెవరు? అని అడుగుతుంది జ్యోత్స్న. మీ బావ భార్యను అంటుంది దీప. ఇంకో పదం కూడా యాడ్ చేసుకో భవిష్యత్తులో చెప్పుకోవడానికి ఉంటుంది అంటుంది జ్యోత్స్న. ఏంటది అని అడుగుతుంది దీప. మాజీ అనే పదం యాడ్ చేసుకో... ఫ్యూచర్ లో బావ నా భర్తగా ఉంటే నువ్వు చెప్పుకోవాల్సింది అదే అని ఇంట్లోకి వస్తుంది జ్యోత్స్న.

38
జ్యోత్స్న షాక్..

దీప, కార్తీక్ మిగతా ఫ్యామిలీ హాల్లో ఉండటం, దీప అందరి ముందే ఫోన్ స్పీకర్ లో పెట్టి మాట్లాడుతూ ఉండటం చూసి షాక్ అవుతుంది. మా ఫోన్లు లిఫ్ట్ చేయడానికి టైమ్ ఉండదు కానీ దీప ఫోన్ లిఫ్ట్ చేసి తిట్టడానికి మాత్రం టైం ఉంటుందా అని సీరియస్ అవుతుంది సుమిత్ర. నువ్వు ఇక మారవా? దీపతో అలా మాట్లాడ్డానికి నీకు సిగ్గు లేదా అని మండిపడతారు పారు, సుమిత్ర. 

48
సుమిత్ర వార్నింగ్

ఇంకోసారి కార్తీక్ గురించి తప్పుగా ఆలోచించినా, తప్పుగా మాట్లాడినా నేను అస్సలు ఊరుకోను. నా గురించి నీకు తెలియదు.. ఒక్కసారి వద్దు అనుకున్నానంటే రక్త సంబంధమైనా పక్కన పెట్టేస్తాను అని వార్నింగ్ ఇస్తుంది సుమిత్ర. సారీ మమ్మీ ఇంకోసారి రిపీట్ చేయను అని చెప్పి లోపలికి వెళ్తుంది జ్యోత్స్న. సరే నువ్వు దీపను తీసుకొని వెళ్లమని కార్తీక్ తో చెప్తాడు దశరథ.

58
కౌంటర్ ఉంటుంది జాగ్రత్త..

దీప, కార్తీక్ వెళ్లబోతుంటే మళ్లీ వస్తుంది జ్యోత్స్న. ఆ రోజు మీ ఇంట్లో దీపను బుక్ చేశానని.. ఈ రోజు మా ఇంట్లోవాళ్లకు నా గురించి తెలిసేలా చేశారు కదా.. దీనికి కచ్చితంగా కౌంటర్ ఉంటుంది బావ అంటుంది జ్యోత్స్న. ఇలాంటివి చాలానే చూశాం.. వెళ్లి బువ్వ తిని బజ్జోమ్మా అంటాడు కార్తీక్.

68
కాంచన కోపం

ఇంటికి వెళ్లిన కార్తీక్, దీపలను కోప్పడుతుంది కాంచన. వాడంటే వాళ్ల మామయ్య ఫోన్ చేయగానే వెళ్లిపోయాడు. కానీ నువ్వు కడుపుతో ఉన్న మనిషివి. ఏ టైంలో బయటకు వెళ్లాలి? ఏ టైంలో వెళ్లకూడదు అని తెలుసుకోవా అని సీరియస్ అవుతుంది కాంచన. నేనే తీసుకెళ్లానులే అమ్మా అంటాడు కార్తీక్. అయినా జ్యోత్స్న లాంటి వాళ్లు స్వార్థం కోసం ఏమైనా చేస్తారు. దానికోసం మీరు ఇలా తిరగడం ఏంటో అంటూ లోపలికి వెళ్లిపోతుంది కాంచన.

78
నోరు జారిన పారు

మరోవైపు సూరజ్ ఇచ్చిన రూ.100 నోటును చూస్తూ, సుమిత్ర మాటలు తలుచుకుంటూ రగిలిపోతుంది జ్యో. అప్పుడే పారిజాతం వస్తుంది. చేతిలో ఆ నోటు ఏంటీ అని పారు అడిగితే, దానికో పెద్ద కథే ఉందిలే అంటుంది జ్యోత్స్న. నీ దగ్గర చాలా కథలే ఉన్నాయ్ అంటుంది పారు. గ్రానీ అని గట్టిగా అరుస్తుంది జ్యోత్స్న. దీప ఇంటి దగ్గరి నుంచి ఫోన్ చేసిందనుకొని నీ బుద్ధి చూపించావు. ఛీ కొట్టించుకున్నావు. ఇకనైనా మారు. నువ్వు నా మనుమడిని, మనుమరాలిని ఇబ్బంది పెడితే నేను అస్సలు ఊరుకోను అంటుంది పారు. 

ఒక అనాథ కోసం సొంత మనుమరాలిని ఇబ్బంది పెడుతున్నావు అంటుంది జ్యోత్స్న. ఎవ్వరే అనాథ. దీపకు ఈ పారిజాతం ఉంది. తనే నా సొంత.. అని ఆగిపోతుంది పారు. హా చెప్పు సొంత... అని అడుగుతుంది జ్యోత్స్న. సొంత మనిషి అని కవర్ చేస్తుంది పారు. నువ్వెందుకు దీపను అంతలా మోస్తున్నావో ఇప్పుడు అర్థమైంది గ్రానీ. త్వరలోనే అన్ని నిజాలు బయటపడతాయి అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న.

88
సూరజ్ కి దీప థ్యాంక్స్

మరుసటి రోజు ఉదయం దీప, కార్తీక్ స్కూటీపై వెళ్తుంటారు. దగ్గర్లో సూరజ్ ని చూస్తారు. కార్తీక్, స్కూటీ ఆపి సూరజ్ గురించి దీపతో చెప్తాడు. ఆ తర్వాత కార్తీక్, దీప సూరజ్ దగ్గరికి వెళ్తారు. దీపను సూరజ్ కి పరిచయం చేస్తాడు కార్తీక్. సూరజ్ కి దీప థ్యాంక్స్ చెప్తుంది. ముగ్గురూ మాట్లాడుకుంటూ ఉండగా.. కార్తీక్ గురించి తనకు ముందే తెలుసని చెప్తాడు సూరజ్. అవునా అన్నట్లు చూస్తారు దీప, కార్తీక్. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories