Karthika Deepam 2 Today Episode (మే 16వ తేదీ)లో జ్యో సీఈఓగా ఉండడానికి ఒప్పుకోని దశరథ. కార్తీక్ సలహాతో కొత్త సీఈఓగా దీప ఎంట్రీ. పారుపై డౌట్ పడిన కార్తీక్. ఓటింగ్ ద్వారా సీఈఓను సెలెక్ట్ చేయాలన్న జ్యోత్స్న. ఈ రోజు ఎపిసోడ్ లో ఇంకా ఏం జరిగిందంటే..
కార్తీక దీపం 2 సీరియల్ శనివారం ఎపిసోడ్ లో వ్యక్తిగత కారణాల వల్ల తాను సీఈఓగా ఉండలేకపోతున్నాను అని చెప్తాడు కార్తీక్. బావ చెప్పేది నిజమే అయితే నాన్న ఎందుకు నన్ను సీఈఓ కాకుండా ఆపుతున్నాడని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. సీఈఓగా జ్యోత్స్న ఉండటంలో నీ అభ్యంతరం ఏంటీ, తను కాకుండా మన ఫ్యామిలీ నుంచి ఇంకా ఎవరున్నారు అని దశరథను అడుగుతాడు శివన్నారాయణ. మీతో కాస్త పర్సనల్‌గా మాట్లాడాలని తండ్రిని తీసుకొని బయటకు వెళ్తాడు దశరథ.
27
జ్యోత్స్న టెన్షన్
జ్యోత్స్న, కార్తీక్ దగ్గరకు వచ్చి నువ్వు ఎంత ట్రై చేసినా.. నన్ను సీఈఓ కాకుండా ఆపలేవు బావ అంటుంది. ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్లిపోతాడు కార్తీక్. పక్కనే శ్రీధర్ కూడా ఉంటాడు. నేను కాకుండా మన ఫ్యామిలీలో ఇంకా ఎవరు సీఈఓ అవుతారు అంటుంది జ్యోత్స్న. మీ అమ్మ సుమిత్ర ఉందిగా. తను కూడా బాగా చదువుకుంది అంటాడు శ్రీధర్. దాంతో టెన్షన్ పడుతుంది జ్యోత్స్న.
37
తను ఎప్పటికీ పెళ్లి చేసుకోదు
మరోవైపు నువ్వు జ్యోత్స్నను సీఈఓ చేస్తే తను ఎప్పటికీ పెళ్లి చేసుకోదు నాన్న.. మనం జ్యోత్స్నను కంట్రోల్ చేయాలి అంటాడు దశరథ. మామయ్య చెప్పింది నిజమే అనుకుంటూ వస్తాడు కార్తీక్. ఏం నిజం రా.. ఇప్పుడు మీరు చెప్పింది నేను వింటే నా మాట పోతుంది కదా అంటాడు శివన్నారాయణ. ఎవ్వరి మాట పోకూడదంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. కానీ అది విని మీరు నన్ను తిట్టొద్దు అంటాడు కార్తీక్. సరే చెప్పమంటాడు శివన్నారాయణ.
ఆ తర్వాత సీన్ లో బోర్డ్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. బోర్డు మెంబర్ ధరణికి సైగ చేస్తుంది జ్యోత్స్న. కొత్త సీఈఓ ఎవరు? అయినా మీ కూతురుకి మించిన అర్హత ఎవరికి ఉంటుందని అంటాడు ధరణి. అర్హత ఉన్నవాళ్లనే పిలిచాను, వస్తున్నారు అని చెప్తాడు దశరథ. అప్పుడే పారిజాతం ఎంట్రీ ఇస్తుంది. ఏంటీ కొత్త సీఈఓ గ్రానీనా అని షాక్ అవుతుంది జ్యోత్స్న.
నేను సీఈఓనా. అందుకేనా ఇంత అర్జెంటుగా నన్ను పిలిచింది అని మురిసిపోతుంది పారు. కార్తీక్, పారును పిలిచి నువ్వు కాస్త పక్కకు తప్పుకుంటే వెనుకున్నవాళ్లు ముందుకు వస్తారు అంటాడు. వెనుక నుంచి దీప ఎంట్రీ ఇస్తుంది. దీపను చూసి అంతా షాక్ అవుతారు.
57
జ్యోత్స్న వాదన
దీపను కూర్చోమంటాడు దశరథ. పనివాళ్ల ప్లేస్ ఇది కాదు అని ఎగతాళిగా మాట్లాడుతుంది జ్యోత్స్న. దీప పని మనిషి కాదు. జ్యోత్స్న రెస్టారెంట్స్ కి కాబోయే సీఈఓ అంటాడు దశరథ. అయ్యో దీన్ని తీసుకొచ్చి నా మనుమరాలికి అన్యాయం చేశానే.. దీన్ని ఎలాగైనా అడ్డుకోవాలి అని మనసులో అనుకుంటుంది పారు. ఇంటి పనివాళ్లను తీసుకొచ్చి సీఈఓ చేయడం రాంగ్ డెసిషిన్ అవుతుందని తండ్రితో వాదిస్తుంది జ్యోత్స్న.
67
పారు డబుల్ రోల్
దీప కడుపుతో ఉంది. ఈ బాధ్యతలన్నీ తనకు అవసరమా.. జ్యోత్స్నకు ఇచ్చేయండని అంటుంది పారు. మీ ఫ్యామిలీ మెంబర్సే సీఈఓగా ఉండాలని చెప్పాము కదా.. ఇప్పుడు వేరేవాళ్లు సీఈఓగా ఉండటం ఏంటి అంటాడు ధరణి. దీప నా కూతురే. నా చెల్లెలి కోడలు అంటే నాకు కూతురే కదా అంటాడు దశరథ. ఇంకా ఎవరికైనా అభ్యంతరం ఉందా అని అడుగుతాడు దశరథ.
77
సీఈఓ దీపేనా?
నాకు ఉందని గట్టిగా చెప్తుంది జ్యోత్స్న. ఓటింగ్ ద్వారా సీఈఓని సెలెక్ట్ చేయాలని చెప్తుంది. సరే అని అంతా ఒప్పుకుంటారు. ఓటింగ్ నిర్వహిస్తారు. పారు, జ్యోత్స్న చిన్నగా మాట్లాడుకునేది కార్తీక్ చూసి, పారుపై డౌట్ పడతాడు. ఓటింగ్ చీటీలను తీసి, సీఈఓ ఎవరో నువ్వే చెప్పమని జ్యోత్స్నకు చెప్తాడు శివన్నారాయణ. వరుసగా మూడు చీటీల్లో జ్యోత్స్న పేరు రావడంతో సంతోషపడుతారు జ్యోత్స్న, పారు. ఆ తర్వాత వరుసగా 3 చీటీల్లో దీప పేరు వస్తుంది. 4 చీటీ తీయడానికి టెన్షన్ పడుతుంది జ్యోత్స్న. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.