Roja Selvamani daughter: చరిత్ర సృష్ణించిన రోజా కూతురు, అమెరికాలో అన్షు మాలిక కు అరుదైన గౌరవం

Published : May 16, 2026, 08:13 AM IST

సౌత్ స్టార్ నటి, ఫైర్ బ్రాండ్ రోజా ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఆమె కూతురు అన్షు మాలిక సాధించిన ఘనత వల్ల రోజా ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఇండయాలోనే ఎవరు సాధించలేని సరికొత్త రికార్డును అన్షు సాధించింది. ఇంతకీ ఆమెకు దక్కిన అరుదైన గౌరవం ఏంటి? 

PREV
15
రోజాకుటుంబంలో పండగ వాతావరణం

సౌత్ స్టార్ నటి, స్టార్ పొలిటీషియన్, మాజీ మంత్రి రోజా సెల్వమణి కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంది. ఆమె కుమార్తె అన్షు మాలిక సెల్వమణి సాధించిన అరుధైన రికార్డుతో రోజా ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఇండియాలో ఇప్పటి వరకూ ఎవరు సాధించలేని అరుధైన అవార్డును ఆమె గెలుచుకుంది. అమెరికాలో అరుదైన గౌరవాన్ని అందుకుని చరిత్ర సృష్టించింది. ఇండియానా యూనివర్సిటీలో అత్యంత ప్రెస్టేజియస్ గా భావించే “హెర్మన్ బి వెల్స్ డిస్టింగ్విష్డ్ సీనియర్ అవార్డు” అందుకున్న తొలి భారతీయ విద్యార్థినిగా అన్షు మాలిక గుర్తింపు పొందింది.

25
అరుధైన అవార్డును గెలుచుకున్న అన్షు మాలిక

అన్షు మాలిక ప్రస్తుతం అమెరికాలోని ఇండియానా యూనివర్సిటీలో లడ్డి స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మాటిక్స్, కంప్యూటింగ్ అండ్ ఇంజినీరింగ్‌లో కంప్యూటర్ సైన్స్‌లో చదువుతోంది. విద్యా ప్రతిభతో పాటు లీడర్షిప్ క్వాలిటీస్ చూపించిన బెస్ట్ స్టూడెంట్ కు ఈ అవార్డును అందిస్తుంటారు. ఇక ఈ గౌరవాన్ని అందుకున్న తొలి భారతీయురాలిగా అన్షు నిలవడం విశేషం.

35
రోజా ఎమోషనల్ కామెంట్స్..

రీసెంట్ గానే అన్షు “హయ్యెస్ట్ డిస్టింక్షన్”తో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఈ సందర్భంగా రోజా సోషల్ మీడియాలో తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది. మదర్స్ డే సందర్భంగా తన కుమార్తె సాధించిన ఈ విజయాన్ని జీవితంలో మర్చిపోలేని గిప్ట్ అని రోజా తెగ సంబరపడిపోయింది. “నా జీవితంలో ఇదే గొప్ప మదర్స్ డే గిఫ్ట్” అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది రోజా.

45
అన్షు సాధించిన ఘనతలెన్నో..

అన్షు మాలిక ఇది మాత్రమే కాదు.. చాలా ఘనతలను సాధించింది. తను చదువకుంటున్న రోజుల్లో పలు ప్రెస్టేజియస్ అవార్డులను కూడా అందుకుంది. మౌరీన్ బిగ్గర్స్ లీడర్‌షిప్ అవార్డు ఫర్ ఈక్విటీ అండ్ టెక్నాలజీ, లడ్డి అకాడెమిక్ ఎక్సలెన్స్ అవార్డు, డీన్ లిస్ట్ గుర్తింపులు, ఫౌండర్స్ స్కాలర్ వంటి అనేక గౌరవాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. అదనంగా గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్ అవార్డు 2024, గ్లోబల్ ఇంపాక్ట్ అడ్వకేట్ అవార్డు 2025 వంటి గుర్తింపులు కూడా ఆమె సాధించింది.

55
రోజా అభిమానుల కోరిక ఇదే

సినిమా, రాజకీయ రంగాల్లో స్టార్ గా వెలుగు వెలుగుతున్న రోజా.. ప్రస్తుతం తన కూతురు సాధించిన విజయాలతో మరోసారి వార్తల్లో నిలిచింది. అన్షు రోజాను మించిన అంతంతో హీరోయిన్ అయ్యే అన్ని లక్షణాలు కలిగి ఉంది. కానీ ఆమె మాత్రం సినీరంగం వైపు రావడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడంలేదు అని తెలుస్తోంది. పిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ హోదాను అనుభవించి, రాజకీయంలో మంత్రిగా కొనసాగిన రోజా కూతురు, ఈ రెండింటిలో ఏది ఎంచుకోకుండా చదువులో రాణిస్తూ.. అంతర్జాతీయ గుర్తింపుని సాధించింది. రోజా అభిమానులు మాత్రం అన్షును హీరోయిన్ గా చూడాలని కోరుకుంటున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories