కథని కిచిడీ చేసేశారా, గేమ్ ఛేంజర్ డిజాస్టర్ పై కార్తీక్ సుబ్బరాజ్ సంచలన వ్యాఖ్యలు..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం ఫ్యాన్స్ కి ఊహించని షాక్ ఇచ్చింది. రాంచరణ్, శంకర్, దిల్ రాజు కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

karthik subbaraj sensational comments Ram Charan Game Changer movie in telugu dtr
Ram Charan

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం ఫ్యాన్స్ కి ఊహించని షాక్ ఇచ్చింది. రాంచరణ్, శంకర్, దిల్ రాజు కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ మూవీ ఫెయిల్యూర్ కి అనేక కారణాలు వినిపించాయి. ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత రాంచరణ్ చేయాల్సింది ఇలాంటి కథ కాదు అని ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు. 

karthik subbaraj sensational comments Ram Charan Game Changer movie in telugu dtr

మొత్తంగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చరణ్ తన నెక్స్ట్ మూవీ పెద్దిపై ఫోకస్ పెట్టారు. ఇలాంటి తరుణంలో మరోసారి గేమ్ ఛేంజర్ ఫెయిల్యూర్ చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రానికి కథ అందించింది డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్. ఆయన కథని శంకర్ తన విజన్ తో నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లాలి అనుకున్నారు. కానీ అది జరగలేదు. కార్తీక్ సుబ్బరాజ్ సూర్యతో రెట్రో అనే చిత్రాన్ని తెరకెక్కించారు. మే 1న ఈ చిత్రం రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా రెట్రో ప్రచార కార్యక్రమాల్లో కార్తీక్ సుబ్బరాజ్ గేమ్ ఛేంజర్ ఫెయిల్యూర్ గురించి ఓపెన్ అయ్యారు. 


ఆయన మాట్లాడుతూ.. గేమ్ ఛేంజర్ చిత్రానికి నేను ఇచ్చిన కథ వేరు.. ఫైనల్ గా స్క్రీన్ పైన వచ్చిన కథ వేరు. నేను ఒక ఐఏఎస్ అధికారి నేపథ్యంలో వేరే వర్షన్ కథ ఇచ్చాను. దానిపై శంకర్ రైటర్స్ టీం చాలా కాలం వర్క్ చేసి కథని పూర్తిగా మార్చేశారు. గేమ్ ఛేంజర్ కథ కిచిడి అయిపోయింది అని కార్తీక్ సుబ్బరాజ్ అన్నారు. 

గేమ్ ఛేంజర్ చిత్రం నిరాశ పరచడానికి కారణం ఇదే అని ఆయన తెలిపారు. ఎప్పుడో 90 దశకంలో కాలం చెల్లిన పొలిటికల్ కథతో శంకర్ చేసిన ప్రయత్నం రాంచరణ్ అభిమానులకు ఏమాత్రం నచ్చలేదు. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ ఫ్యాన్స్ అదే స్థాయిలో విజువల్ వండర్ ఆశించారు. 

గేమ్ ఛేంజర్ చిత్రం విజువల్ వండర్ మూవీ కాదు. నార్మల్ పొలిటికల్ డ్రామా. ఏది ఏమైనా గేమ్ ఛేంజర్ ఎఫెక్ట్ నుంచి అందరూ బయటపడి కొత్త ప్రాజెక్ట్స్ తో బిజీ అయిపోయారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన రెట్రో చిత్రం సూర్య కెరీర్ కి చాలా కీలకం. ఎందుకంటే సూర్య నటించిన చివరి మూవీ కంగువా ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

Latest Videos

vuukle one pixel image
click me!