కానీ డాక్టర్ బాబు వినకుండా, నీకు డబ్బు కావాలంటే ముఖం మీద అడుగు కాని,ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు.ఇంకెప్పుడు నీ మొఖం నాకు చూపించొద్దు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సీన్లో సౌర్య వారణాసితో, నాకు పదేళ్ల వరకు మా నాన్న ఎవరో తెలియలేదు.తీరా మా నాన్న ఎవరో తెలిసారు అనుకునేసరికి ఇలాగ అయింది. అసలు కనీసం నా చదువు అయ్యేంతవరకు అయినా, లేకపోతే పెళ్లి అయ్యేంత వరకు అయినా ఉండొచ్చు కదా! నన్ను ఇలా మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయారు అని అంటుంది.