ఈరోజు ఎపిసోడ్ లో ఆనందరావు కార్తీక్,దీపలు ప్రాణాలతో లేరా అని అనగా వెంటనే సౌందర్య ఆ విషయంలో నాకు అనుమానం లేదు. ఎందుకంటే నేను సౌర్య కోసం రాకముందే ఆ ఇంద్రుడు సౌర్యను తీసుకొని ఊరు వదిలి వెళ్ళిపోయాడు. అంటే అంతకుముందు ఎవరికో భయపడ్డాడు అంటే కార్తీక్ దీప లకు భయపడ్డాడేమో అని అంటుంది సౌందర్య. అప్పుడు హిమ మరి అమ్మ నాన్నలు బతికే ఉన్నారా అని అనగా అప్పుడు అది మన అదృష్టం నమ్మకం ఎందుకంటే శౌర్య మన చేతికి చెప్పినట్టే చిక్కి దూరంగా వెళ్ళిపోతోంది అని అంటుంది. మరొకవైపు దీప హాస్పిటల్ బెడ్ పై ఉండగా దీప ని చూసి కార్తీక్ ఎమోషనల్ అవుతూ ఉంటాడు.