Kartik Aaryan: అభిమానితో బాలీవుడ్ యంగ్ స్టార్ కార్తిక్ ఆర్యన్ పెళ్లి.. ఓ ఈవెంట్ లో ప్రపోజ్ చేసిందట

First Published | Jan 16, 2022, 3:29 PM IST

బాలీవుడ్ యంగ్ స్టార్ కార్తిక్ ఆర్యన్ పెళ్లి జరిగిపోయిందట. అది కూడా ఓ అభిమానితో జరిగిపోయిందట. ఈ విషయాన్ని ఎవరో కాదు స్వయంగా కార్తిక్ ఆర్యన్(Karthik Aryan) వెల్లడించాడు. ఇంతకీ అబిమానితో పెళ్ళి జరగడం ఏంటీ..?

ఈమధ్య అభిమానులకు.. అభిమానానికి అర్ధాలు మారిపోతున్నాయి. సోషల్ మీడియా జనాల పైత్యానికి కూడా హద్దులు లేకుండా పోతున్నాయి. ఈ విషయాన్ని సెటైరికల్ గా ఎక్స్ ప్రెస్ చేశాడు బాలీవుడ్ యంగ్ స్టార్ కార్తిక్ ఆర్యన్(Karthik Aryan). తన పెళ్లి గురించి వస్తున్న వార్తలను గురించి రీసెంట్ గా స్పందించాడు.ఓ ఇంటర్వూలో ఫన్నీ మూమెంట్స్ ను గుర్తు చేసుకున్నారు కార్తిక్.

రీసెంట్ గా కార్తిక్ ఆర్యన్(Karthik Aryan) కు సోషల్ మీడియాలో పెళ్ళి చేసేశారు. అది కూడా తన వీరాభిమాని ఓ అమ్మాయితో. ఈ విషయాన్ని ఇంటర్వ్యూలో ప్రస్తావించిన కార్తిక్ ఆర్యన్. తనకు తెలియకుండానే తన పెళ్లి చేసేశారన్నారు. ఈ న్యూస్ బాగా వైరల్ అయ్యి.. సోషల్ మీడియాలో చూసే వరకూ అసలు విషయం తనకు తెలియదన్నారు. అయితే ఎందుకు ఈ న్యూస్ ఇలా పుట్టుకొచ్చిందో కూడా వివరించారు కార్తిక్ ఆర్యన్.


రీసెంట్ గా ఓ సినిమా ఈవెంట్ లో ఓ లేడీ ఫ్యాన్ తన దగ్గర కు వచ్చిందట. వచ్చి రావడంతోనే తన దగ్గరగా వచ్చి.. తనను పెళ్లి చేసుకోమని బ్రతిమలాడిందట.ఈ సీన్ అక్కడితో అయిపోయింది. కాని ఈ విషయాన్ని గట్టిగా పట్టుకున్న సోషల్ మీడియా ఆ అమ్మాయితో కార్తిక్ ఆర్యన్ పెళ్ళి చేసేశారట. ఈ విషయాన్ని చెపుతూ బిగ్గరగా నవ్వేశారు కార్తిక్(Karthik Aryan). హద్దులు దాటుతున్న రూమర్ ట్రెండ్స్ పై గట్టిగా కౌంటర్ ఇచ్చారు.

బాలీవుడ్ లో కార్తిక్ ఆర్యాన్(Karthik Aryan) రొమాంటిక్ హీరో ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు. ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్ ను కార్తిక్ అంటే చాలా క్రష్. ఆయన ఎక్కడికి వెళ్లినా వెంటపడుతుంటారు లేడీ ఫాలోవర్స్. కార్తిక్ ఆర్యన్ కూడా హ్యాండ్సమ్ లుక్ తో.. బాలీవుడ్ లో మంచి ఇమేజ్ సాధించాడు. వరుస సినిమాలతో దడదడలాడిస్తున్నాడు

కార్తిక్ అంతే బాలీవుడ్ లో ఎంత అభిమానం అంటే..ఓ ఫ్యాన్ తన గుండెల మీద కార్తిక్ ఆర్యన్ (Karthik Aryan) ఫోటోను పచ్చ బొట్టు వేయించుకున్నారంటే.. ఈ యంగ్ స్టార్ అంటే ఎంత ఇష్టమో తెలుస్తుంది. 2011 లో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన కార్తిక్.. వరుసగా సినిమాలు చేస్తూ.. ఇంత వరకూ వచ్చాడు. ముందు ముందు బాలీవుడ్ లో స్టార్ హీరోలను పక్కకు నెట్టి..కార్తిక్ ఆర్యన్ సూపర్ స్టార్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.

ప్రస్తుతం కార్తిక్ ఆర్యన్(Karthik Aryan) చూపు సౌత్ కథలవైపు మళ్ళింది. అందులోను టాలీవుడ్ పై కార్తిక్ చూపు ఉంది. ఇక్కడ నుంచి పాన్ ఇండియా సినిమా చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడట కార్తిక్. ఇప్పటికే అల్లు అర్జున్ అలవైకుంఠపురము హిందీ రీమేక్ లో హీరోగా నటిస్తున్నాడు కార్తిక్. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేసుకోవల్సి ఉంది. షహజాది టైటిల్ తో.. హిందీలో రీమేక్ అవుతుంది అలవైకుంఠపురమలో సినిమా.  

Latest Videos

click me!