అప్పుడు ఇంద్రుడు చంద్రమ్మ తినమని చెప్పి కింద కూర్చుంటుండగా పైనే కూర్చుని తినమని చెబుతాడు ఆనందరావు. అప్పుడు హిమ దీప వాళ్ళను తలుచుకొని ఆలోచిస్తూ బాధపడుతూ ఉండగా తిను హిమ అనడంతో నాకేం నచ్చలేదు నేను తినను తాతయ్య అని అంటుంది. అప్పుడు సౌర్య సీరియస్ అవుతూ మా పిన్ని బాబాయిలు డైనింగ్ టేబుల్ పై కూర్చున్న తినడం నీకు ఇష్టం లేదు ఇదేం బుద్ధి నీకు అని సీరియస్ అవుతుంది. అప్పుడు హిమ నాతో చెప్పిన వినిపించుకోకుండా సౌర్య, హిమ మీద సీరియస్ అవుతుంది. అప్పుడు సౌర్య ఇంద్రుడు వాళ్ళను మనం సపరేట్ గా తిందాం లేండిగా అని అక్కడి నుంచి పిలుచుకొని వెళ్తుంది. మరొకవైపు చారుశీల, మోనిత కు కార్తీక్ అంటే ఎందుకు అంత ఇష్టం పెళ్లి పదేళ్ల ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా ఇంకా ఇష్టపడుతూనే ఉంది కారణం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది.