రోడ్డుపై నడుస్తూ వస్తున్న కార్తీక్ దీపాలకు కారులో నుంచి శౌర్య గొంతు వినిపిస్తుంది. దాంతో ఇద్దరు పరిగెత్తుకుంటూ వెళ్తారు అయిన కూడా పట్టుకోలేకపోతారు. మరోవైపు కారును ఫాలో చేసిన ఇంద్రుడు శౌర్యను తీసుకెళ్ళిపోతాడు. నేను రాను తాతయ్య, అమ్మనాన్న కనిపించే వరకు నేను ఇంటికి రాను అని చెప్పి ఇంద్రుడుతో వెళ్ళిపోతుంది. శౌర్య మాటలకూ ఆనంద్ రావు, హిమలు కన్నీళ్లు పెట్టుకుంటారు. ఇక ఆటోలో ఊరి వదిలి వెళ్ళిపోదాం శౌర్య అని ఇంద్రుడు చెప్తాడు.