కొంప ముంచిన బిహేవియర్.. గీతూ ఎలిమినేషన్ కి ప్రధాన కారణాలు ఇవే..

First Published Nov 7, 2022, 7:35 AM IST

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 6లో ఆదివారం రోజు ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఎవరూ ఊహించని విధంగా కంటెంట్ కింగ్ గా పేరుగాంచిన గీతూ రాయల్ ఎలిమినేట్ అయింది.

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 6లో ఆదివారం రోజు ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఎవరూ ఊహించని విధంగా కంటెంట్ కింగ్ గా పేరుగాంచిన గీతూ రాయల్ ఎలిమినేట్ అయింది. ఆమె ఎలిమినేషన్ అనూహ్యం అనే చెప్పాలి. తొలి రోజు నుంచి ఎలిమినేట్ అయ్యే వరకు ఆమె ఎనెర్జీ లెవల్స్ పీక్స్ అనే చెప్పాలి. 

గీతూ తాను చెప్పినట్లుగా ఎక్కడా తగ్గలేదు. తొలి రోజు నుంచే గీతూ ఇతర కంటెస్టెంట్స్ తో హార్ష్ గా ఉండడం మొదలు పెట్టింది. బాగా ఎంతెర్తైనింగ్ గా ఉండడంతో ప్రేక్షకులు కూడా ఆమెకి ఫిదా అయ్యారు. కానీ ఎపిసోడ్స్ గడిచే కొద్దీ గీతూ బిహేవియర్ పట్ల నెగిటివిటి పెరిగిపోయింది. ఏ ఆటలో అయినా నిబంధనలు కాకుండా క్రీడా స్ఫూర్తి అనేది ఒకటి ఉంటుంది. 

కొన్ని సార్లు రూల్స్ ప్రకారం చేసేది కరెక్ట్ కావచ్చు. కానీ క్రీడా స్ఫూర్తిని మరువకూడదు. తాను హౌస్ లోకి వచ్చింది మైండ్ గేమ్ ఆడేందుకే అని గీతూ ఆల్రెడీ చెప్పింది. కానీ ఆ క్రమంలో ఇతరుల ఎమోషన్స్ ని దెబ్బతీసి పైచేయి సాధించాలనుకుంది. గీతూకి హౌస్ లో ఇదే మొదటి బిగ్ మైనస్. ఆట పరంగా ఆమె చేసేది కరెక్ట్ కావచ్చు. 

కానీ చూసే ప్రేక్షకులకు ఆమె పట్ల నెగిటివిటీ పెరిగింది. గీతూ ఫిజికల్ గేమ్స్ లో అంతగా పెర్ఫామ్ చేయలేదు. గీతూ కన్నా ఫిజికల్ గేమ్స్ లో బద్దకంగా ఉండేవారు హౌస్ లో ఉన్నారు. తాను ఫిజికల్ ఆడడం లేదు కాబట్టి ఎలాగైనా మైండ్ గేమ్ తో ఇతరులపై పైచేయి సాధించాలి అని గీతూ అనుకుంది. ఆమె ఎలిమినేషన్ కి ఇది కూడా ఒక కారణం.  

అలాగే గత రెండు వారాల్లో గీతూ ఆదిరెడ్డి, బాలాదిత్యతో ప్రవర్తించిన విధానం కూడా ఒక మైనస్ గా మారింది. గీతూతో సమానంగా హౌస్ లో రచ్చ చేసే రేవంత్ కూడా కొన్ని సందర్భాల్లో ప్రేక్షకులతో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాడు. కానీ గీతూ మాత్రం మైండ్ గేమ్ మాయలో పడి తన ప్రవర్తన మార్చుకోలేదు. 

మొత్తంగా బిగ్ బాస్ సీజన్ 6లో గీతూ బలమైన ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. గీతూ ఎలా ఆడినా బిగ్ బాస్ గేమ్ కోసమే ఆడింది. నాగార్జున కూడా ఆమెకి ఫిదా అయ్యారు. మొత్తంగా మైండ్ గేమ్ తో ఫైనల్ వరకు వెళ్లాలనుకున్న గీతూ ప్రయాణం మధ్యలోనే ముగిసింది. 

click me!