OTT లోకి కార్తీ ‘సత్యం సుందరం’..ఎప్పటి నుంచి, స్ట్రీమింగ్ డిటేల్స్

First Published | Oct 19, 2024, 12:38 PM IST

లెక్క ప్రకారం దీపావళికి స్ట్రీమింగ్ అనుకున్నారు కానీ ఇప్పుడు ఓ వారం ముందే తీసుకొచ్చే ప్లాన్‌లో ఉన్నారట.

Karthi, Sathyam Sundaram, OTT,


కార్తీ, అరవింద్‌ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సత్యం సుందరం’. 2డి ఎంటర్‌టైన్‌మెంట్‌పై సూర్య, జ్యోతిక నిర్మించిన ఈ సినిమా తెలుగులో ఈ నెల 28న విడుదలైంది. ఏషియన్‌ సురేష్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పీ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్‌ చేసింది. తమిళ్‌లో '96' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సి. ప్రేమ్‌కుమార్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.  

సత్యం సుందరం( Satyam Sundaram Movie ) సినిమాకు తెలుగు లో కూడా మంచి టాక్ వచ్చింది. రివ్యూలు కూడా చాలా బాగా వచ్చాయి. అయితే కలెక్షన్స్ మాత్రం కనపడ లేదు. అందుకు కారణం మొహమాటం లేకుండా దేవర సినిమానే అని అప్పట్లో తేల్చారు.  ఎందుకంటే సత్యం సుందరం చిత్రం దేవర రిలీజైన మరుసటి రోజు రిలీజ్ అవ్వటమే అంటారు. ఈ నేపధ్యంలో చాలా మంది ఈ చిత్రం ఓటిటి రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. స్ట్రీమింగ్ తేదీ బయిటకు వచ్చింది.

‘96’ చిత్రంతో ఓ సున్నితమైన ప్రేమకథను మనసులకు హత్తుకునేలా చూపించి మెప్పించిన  దర్శకుడు సి.ప్రేమ్‌కుమార్‌ సినిమా ఇది. దాదాపు  ఆరేళ్ల గ్యాప్ తీసుకుని  ఇప్పుడాయన ‘సత్యం సుందరం’ (Satyam Sundaram 2024) అంటూ మరో ఆహ్లాదభరితమైన భావోద్వేగభరిత చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు.

కార్తి (Karthi), అరవింద్ స్వామి (Aravind Swamy) ఇందులో ప్రధాన పాత్రలు పోషించడం.. సూర్య, జ్యోతిక దంపతులు స్వయంగా నిర్మించడం.. దీనికి తోడు టీజరు,ట్రైలర్లు అలరించేలా ఉండటంతో ప్రేక్షకుల్లో దీనిపై మంచి ఎక్సపెక్సటేషన్స్  ఏర్పడ్డాయి.  



 ఈ సినిమా దేవర రిలీజ్ టైమ్ లో కాకుండా ఒక వారం లేటుగా వచ్చి ఉంటే బాగుండేదని ట్రేడ్ అంటోంది . అక్కడ తమిళ వెర్షన్ ముందే వచ్చినా ఇబ్బంది ఉండేది కాదని అంటున్నారు.అయితే రిలీజ్ కు ముందు నిర్మాతకు భయం ఉంటుంది. తమిళంలో నెగిటివ్ టాక్ వస్తే తెలుగులో ఎవరూ చూడరని రెండు వెర్షన్స్ ఒకేసారి రిలీజ్ చేసేసారు. దాంతో సత్యం సుందరం లాంటి మంచి సినిమాకు రిజల్ట్  ఇలా దారుణంగా ఉండడంతో చాలామంది  ఈ సినిమాకు దేవర  శాపం తగిలిందని అన్నారు.
 


 ‘సత్యం సుందరం’ మూవీ డిజిటల్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. లెక్క ప్రకారం దీపావళికి స్ట్రీమింగ్ అనుకున్నారు కానీ ఇప్పుడు ఓ వారం ముందే తీసుకొచ్చే ప్లాన్‌లో ఉన్నారట. అక్టోబర్ 25 నుంచే 'సత్యం సుందరం' సినిమా తెలుగులోనూ ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని అంటున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.  
 

Karthi, Sathyam Sundaram, OTT,


సత్యం సుందరంలో  మన ఇంట్లో లేదా మన పక్కింట్లో జరిగే సంఘటనలే సినిమాలో కనిపించటంతో చూసిన వాళ్లకు బాగా నచ్చుతుంది. ఈ సినిమా  కొన్నిచోట్ల నవ్విస్తే.... ఇంకొన్నిచోట్ల ఏడిపిస్తుంది. చిన్ననాటి ముచ్చట్లు, చిన్నప్పుడు మనందరి జీవితంలో  జరిగే సరదాలు..

ఇంకా చాలా గుర్తులు మన కళ్లముందు ప్రత్యక్షం చేసారు దర్శకుడు. సినిమా చూస్తున్నంతసేపు ఎమోషనల్‌గా కనెక్ట్  అవుతున్నారు.  సినిమా  ప్రారంభం నుంచి చివరి వరకూ కార్తీ, అరవింద్ స్వామిలతో ప్రేక్షకుడు కూడా నడుస్తాడు. ఓటిటిలో ఈ సినిమాని బాగానే చూస్తారని అంచనా వేస్తున్నారు. 

Latest Videos

click me!