సైజ్‌ జీరో నుంచి సైజ్‌ 16.. ప్రతి దశని ఎంజాయ్‌ చేశాః కరీనా కపూర్‌.. ప్రెగ్నెంట్‌ జర్నీ గురించి ఇంట్రెస్టింగ్‌

Published : Mar 07, 2022, 07:09 PM ISTUpdated : Mar 07, 2022, 08:40 PM IST

తాజాగా తన ప్రెగ్నెన్సీ గురించి ఆసక్తికర పోస్ట్ ని షేర్‌ చేసింది కరీనా. తాను రెండో కుమారుడు జెహ్‌కి జన్మనిచ్చేందుకు నెల రోజుల ముందు అంటే తన 8 నెలల గర్భవతి సమయంలో ఆమె ప్రముఖ మేగజీన్‌ `పూమా`కి ఫోటోలకు పోజులిచ్చింది.

PREV
16
సైజ్‌ జీరో నుంచి సైజ్‌ 16.. ప్రతి దశని ఎంజాయ్‌ చేశాః కరీనా కపూర్‌.. ప్రెగ్నెంట్‌ జర్నీ గురించి ఇంట్రెస్టింగ్‌

బాలీవుడ్‌ బెబో కరీనా కపూర్‌(Kareena Kapoor) ఇద్దరు కుమారులకు జన్మనిచ్చింది. బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌(Saif Ali Khan)ని ప్రేమించి 2012లో కరీనా కపూర్‌ మ్యారేజ్‌ చేసుకున్న విషయం తెలిసిందే. 2016లో పెద్ద కుమారు తైమూర్‌ అలీ ఖాన్‌కి, 2021లో జెహ్‌కి జన్మనిచ్చింది కరీనా కపూర్‌. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు మదర్‌హుడ్‌ని కూడా ఎంజాయ్‌ చేస్తుంది. రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ అటు పర్సనల్‌ లైఫ్‌ని, ఇటు కెరీర్‌ని  ఎంజాయ్‌ చేస్తుంది కరీనా కపూర్‌. 
 

26

తాజాగా తన ప్రెగ్నెన్సీ గురించి ఆసక్తికర పోస్ట్ ని షేర్‌ చేసింది కరీనా. తాను రెండో కుమారుడు జెహ్‌కి జన్మనిచ్చేందుకు నెల రోజుల ముందు అంటే తన 8 నెలల గర్భవతి సమయంలో ఆమె ప్రముఖ మేగజీన్‌ `పూమా`కి ఫోటోలకు పోజులిచ్చింది. అయితే ఆయా ఫోటోలను ఇప్పుడు షేర్‌ చేసుకుంది కరీనా. దీనికి ఇంటర్య్వూ ఇవ్వగా, వాటిని పంచుకుంది కరీనా కపూర్‌. ఇందులో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. అదే సమయంలో జీరో సైజ్‌ నుంచి సైజ్‌ 16 వరకు తన బాడీ ట్రాన్ఫ్సమేషన్‌ జరిగిన విధానాన్ని వెల్లడించింది కరీనా. 

36

ఇన్‌స్టాగ్రామ్‌లో కరీనా షేర్‌ చేస్తూ, గజిబిజిగా ఉండే జుట్టు అయినా, గ్లామర్‌ ఔట్‌ఫిట్‌ అయినా, సైజ్‌ జీరో అయినా, సైజ్‌ 16 అయినా తన  జీవితంలోని ప్రతి దశని పూర్తిగా జీవించాను, ఆనందించాను అని తెలిపింది కరీనా కపూర్‌. ప్రతి దశలోని జీవితాన్ని ఎంజాయ్‌ చేసినట్టు పేర్కొందీ అందాల భామ. 
 

46

ప్రెగ్నెంట్‌ టైమ్‌లో తాను 25 కేజీల బరువు పెరిగినట్టు తెలిపింది. అయితే తాను ప్రేమించే దాని విషయంలో, ఇష్టమైన పనులను చేయడంలో ఆ ప్రభావం పడకుండా చూసుకున్నట్టు తెలిపింది. పుమాకి ఫోటోలిచ్చినప్పుడు తాను ఎనిమిది నెలల గర్భవతిగా ఉన్నానని తెలిపింది. ఆ సమయంలో చాలా సరదాగా గడిపినట్టు చెప్పింది కరీనా కపూర్‌. 

56

తన చర్మంపై తనకు నమ్మకం ఉందని, అందుకే తన బేబీ బంప్‌ని ప్రదర్శించినట్టు చెప్పింది కరీనా కపూర్‌. ప్రతి అమ్మాయి తనజీవితం, తమ నిర్ణయాలు మాత్రమే ముఖ్యమైనవి తన ఇంటర్వ్యూ చదివే ముందు తెలుసుకోవాలని చెప్పింది. ఆ స్ఫూర్తితోనే, పుమా సహకారంతో మీరు కూడా ఇలా ఉండేందుకు మీకు వేదికని అందించాలనుకుంటున్నామని తెలిపింది. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 7(నేటి) నుంచి 13 వరకు పుమాస్టోర్‌కి వెళ్లాలని, వందమంది ఉచితంగా దుస్తులు తీసుకోవచ్చని పేర్కొంది కరీనా. 

66

కరీనా కపూర్‌ ప్రెగ్నెంట్‌ టైమ్‌లోనే అమీర్‌ ఖాన్‌ నటించిన `లాల్‌ సింగ్‌ చద్దా`లో హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత తన రెండో కుమారుడు జెహ్‌కి జన్మనిచ్చింది. ఇక `లాల్‌ సింగ్‌ చద్దా` చిత్రం ఏప్రిల్‌లో విడుదలకు సిద్ధమవుతుంది. ఇదిలా ఉంటే తైమూర్‌ జన్మించిన తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తూ పలు సినిమాలు చేస్తుంది కరీనా. మళ్లీ ఇప్పుడు కూడా రీ ఎంట్రీ ఇస్తుందా? లేదా అనేది చూడాలి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories