కాస్ట్లీ కారు కొన్న కరీనా కపూర్, కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..

Published : Oct 20, 2023, 10:19 AM IST

సోషల్ మీడియా జనాల కళ్లు ఎప్పుడూ సెలబ్రిటీల మీదే ఉంటుంది. వాళ్లు ఏం చేస్తున్నారు...? ఏం కొంటున్నారు..? ఎక్కడ ఉంటున్నారు..? ఎవరైనా కొత్తవారితో తిరుగుతున్నారా..? ఇక సినిమా సెలబ్రిటీలు ఎవైనా కొత్తవి, కాస్ట్లీవికొంటే.. నెట్టింట్ పండగే. ఆ న్యూస్ వైరల్ చేసి వదిలిపెడతారు. తాజాగా అలాంటి న్యూస్ ఒకటి వైరల్అవుతోంది. 

PREV
16
కాస్ట్లీ కారు కొన్న కరీనా కపూర్, కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..

బాలీవుడ్ టాలీవుడ్ అని లేదు.. ఇండస్ట్రీలో ఎవరు ఏది కొత్తగా కొన్ని.. ఆకరికి ఓ స్టార్ బ్రాండెడ్ చెప్పులు వేసుకున్నా ప్రస్తుతం న్యూస్ ఐటమ్ అవుతోంది. టీషట్లు, వాచ్ లు, కార్లు ఇలా సెలబ్రిటీల వస్తువులపై వైరల్ న్యూస్ లు చూస్తూనే ఉన్నాం. తాజాగా బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ ఇలానే వార్తల్లో నిలుస్తోంది. 

26

బాలీవుడ్ సీనియర్ బ్యూటి కరీనా కపూర్ గురించి ప్రత్యేక చెప్పాల్సిన అవసరం లేదు.. పెళ్లై ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత కూడా ఏమాత్రం తగ్గకుండా.. వరుస సినిమాలు చేసుకుంటూ.. అటు కమర్షియల్ ఆడ్స్ ద్వారా కూడా కోట్లు గడిస్తుంది బ్యూటీ. అంతే కాదు బయట బిజినెస్ లు కూడా చేస్తూ.. చేతి నిండా సంపాదిస్తోంది. 
 

36
Kareena Kapoor

ఇంత బిజీగా ఉన్నా.. ఆమె  సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటంది. ఇటు సోషల్ మీడియా పోస్ట్ ల ద్వారా కూడా ఆమెకు ఇన్ కమ్ వస్తుండటంతో.. ఫ్యాషన్ ను ఫాలో అవుతూ..  ట్రెండ్ కు తగ్గట్లు డ్రెస్సులు వేస్తూ.. ఇన్ స్టాలో తెగ సందడి చేస్తుంది బ్యూటీ. అంతే కాదు ఎప్పుడూ ఏదో ఒక రకంగా న్యూస్ ఐటమ్ అవుతూ ఉంటుంది సీనియర్ బ్యూటీ. 

46

కాంట్రవర్సీయల్ కామెంట్స్, కాస్ట్లీ వస్తువుల కొనడం దగ్గర నుంచి ఆమె లగ్జరీలైఫ్ కుసబంధించిన రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరలు అవుతూ ఉంటాయి ఎప్పుడూ. ఆమె పిల్లల కేరింగ్ తీసుకునే ఆయాల జీతం, ఆమె వాడే బ్యాగ్ ల కాస్ట్.. ఇలా ఎన్నో విషయాల్లో వార్తల్లో నిలిచింది కరీనా. తాజాగా మరోసారి ఆమె హాట్ న్యూస్ అయ్యింది. 
 

 

 

56

ఎప్పుడూ లగ్జరీ వస్తువులనే కొనుగోలు చేస్తుంది కరీనా కపూర్. తాజాగా మరో లగ్జరీ కారును కొనుగోలు చేసింది.. ప్రముఖ కార్ల దిగ్గజ సంస్థ అయిన ల్యాండ్‌ రోవర్ డిఫెండర్‌ ఎస్‌యూవీ కారును ఆమె  సొంతం చేసుకుంది.ఆ కారు ధర అక్షరాల 1.2 కోట్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం సోషల్ మీడియాలో  ఈకారుతో పాటు కరీనా కూడా ట్రెండ్ అవుతుంది.. 
 

66
kareena kapoor

ఇక కరీనా సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం కరీనా కపూర్ హీరోయిన్ గా హన్సల్‌ మెహతా తెరకెక్కిస్తున్న చిత్రం ది బకింగ్‌హామ్‌ మర్డర్స్‌లో నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమాలోని కరీనా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని మూవీ టీమ్ రీసెంట్ గా రిలీజ్ చేసింది. 

Read more Photos on
click me!

Recommended Stories