బొట్టేది, తాళేది? పెళ్లైన అమ్మాయి ఇలా ఉంటుందా? శ్రావణ భార్గవిపై విరుచుకుపడ్డ కరాటే కళ్యాణి

Published : Jul 21, 2022, 11:27 PM IST

స్టార్‌ సింగర్‌ శ్రావణ భార్గవి `అన్నమయ్య కీర్తనలు` వివాదం మరింత రాజుకుంటుంది. తాజాగా ఈ వివాదంలోకి కాంట్రవర్సీలకు మారు పేరుగా నిలుస్తున్న కరాటే కళ్యాణి వచ్చింది. శ్రావణ భార్గవిపై విరుచుకుపడింది.   

PREV
16
బొట్టేది, తాళేది? పెళ్లైన అమ్మాయి ఇలా ఉంటుందా? శ్రావణ భార్గవిపై విరుచుకుపడ్డ కరాటే కళ్యాణి

సింగర్‌ శ్రావణ భార్గవి(Sravana Bhargavi) `అన్నమయ్య కీర్తనల`(Annamaya Keerthana)ను ఉపయోగించి రూపొందించిన వీడియో రెండు రోజులుగా దుమారం రేపుతుంది. భక్తికి ప్రతిరూపంగా నిలిచే కీర్తనలను శృంగారభరితంగా ఉపయోగించిందని ఇది శ్రీవారి కీర్తనలను అపహాస్యం చేయడమే అని అన్నమయ్య ట్రస్ట్ సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. దీన్ని వెంటనే తొలగించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఇలా చేయడం కీర్తనలను అవమానించడమే అని ఆరోపిస్తున్నారు. 
 

26

దీంతో ఈ వివాదం దుమారం రేపుతుంది. దీనిపై బీజేపీ నాయకులు, హిందూ మత సంఘాల నాయకులు అభ్యంతరం తెలియజేస్తున్నారు. అయితే ఇందులో తాను చేసింది తప్పేమి లేదని, తాను అందంగానే రూపొందించాని, కాళ్లు ఊపడం, జంతికలు తినడం తప్పేమి లేదని, వల్గారిటీగా ఏం కనిపించడం లేదని, ఒకవేళ మీకు అలా కనిపిస్తే అది మీ చూపుల్లో ఉన్న తప్పు అని ఆమె ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఆ వీడియోని తొలగించేది లేదని స్పష్టం చేసింది.

36

ఈ నేపథ్యంలో ఈ వివాదంలోకి మరో నటి దూరింది. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్న కరాటే కళ్యాణి(Karate Kalyani) ఇటీవల `బిగ్‌ బాస్‌` షోతో పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కళ్యాణి వివాదాలకు కేరాఫ్‌ గా నిలుస్తుంది. ఇప్పుడు ఆమె శ్రావణ భార్గవిపై మండిపడింది. తన దైన స్టయిల్‌లో బోల్డ్ గా రియాక్ట్ అయ్యింది. సింగర్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది. 

46

కరాటే కళ్యాణి స్పందిస్తూ, కాళ్లు ఊపుతూ భక్తి పాటలు పాడతారా? అంటూ రెచ్చిపోయింది. హిందూ ధర్మం ప్రకారం పెళ్లి అయిన అమ్మాయి తాళిబొట్టు లేకుండా, నుదుటిగా బొట్టు లేకుండా, మెట్టెలు లేకుండా ఉంటారా? అని ప్రశ్నించింది కరాటే కళ్యాణి. ఇవేవీ శ్రావణ భార్గవి పెట్టుకోలేదని, ఎందుకు పెట్టుకోలేదో తనకు అర్థం కావడం లేదని తెలిపింది. ఇవేవీ లేకుండా, హిందూ సాంప్రదాయం పాటించకుండా కాళ్లు పైకెత్తి అన్నమయ్య కీర్తనలు పాడతానంటే కుదురుతుందా? మీ పైత్యాన్ని భక్తి పాటల్లో చూపిస్తే ఊరుకునేది లేదని ఘాటుగా రియాక్ట్ అయ్యింది. 

56

ఇంకా కరాటే కళ్యాణి స్పందిస్తూ, పాటని తొలగించనని చెబుతుందని, అందుకు ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా బాధపడుతుందని, డిలీట్‌ చేయకపోయినా, చిన్న చిన్న అభ్యంతరాలను తొలగించినా చాటు. నేను డిలీట్‌ చేయను, నా ఇష్టం నువ్వెవరు చెప్పడానికి అనుకుంటే అంతకంటే ముర్ఖత్వం మరోటి లేదని ఫైర్‌ అయ్యింది. తగిన సూచనలు చేసింది. కె. విశ్వనాథ్‌ గారు సినిమాలు తీశారు, రాఘవేంద్రరావుగారు చేశారని అంటున్నారు. అప్పటికీ మనం పుట్టలేదు. అంతేకాదు అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు మారాయని, అప్పుడు అడగలేదని, ఇప్పుడు అడక్కుండా ఉంటామా? సంగీతాన్ని అపహాస్యం చేస్తే ఊరుకోమని హెచ్చరించింది. 

66

`అన్నమయ్య కీర్తనలను అపహాస్యం చేయడం మంచి పద్దతి కాదు. ఆమెది తప్పు అనడం లేదు. కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని అంటున్నాం. మా మాట వింటే బాగుంటుంది. కొన్ని కొన్ని వివాదాలు అనుకోకుండా వస్తుంటాయి. ఆమె టైమ్‌ బాలేదు అనుకోవడమే. ఈ పాటకి బీజేపీకి సంబంధం లేదు. బుర్ర బుద్ది ఉన్నోడు రెండింటికి సంబంధం ఉందని అనుకోడు. హిందూత్వం అనేసరికి బీజేపీ, ఓటు బ్యాంక్‌ అంటారు. నేను బ్రాహ్మిణ్‌, నేను హిందూ, నేను తప్పేం చేశాను అంటే ఎలా? నా ఇష్టం వచ్చినట్టు పాడుతా? నా ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే కుదరదు` అని శ్రావణ భార్గవకి స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చింది కరాటే కళ్యాణి. ప్రస్తుతం కరాటే కళ్యాణి వ్యాఖ్యలు సైతం వైరల్‌ అవుతున్నాయి. మరి ఈ వివాదం ఇంకా ఎంత వరకు వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories