స్టేజ్ పై నటి శ్రద్ధాకు అవమానం.. నోటికొచ్చినట్టు మాట్లాడిన కొరియోగ్రాఫర్.. కన్నీళ్లు పెట్టుకున్న గెస్ట్ జడ్జీ

Published : Jul 21, 2022, 09:38 PM IST

నటి శ్రద్ధా దాస్ పాపులర్ డాన్స్ షో ‘ఢీ14’కు జడ్జీగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే లేటెస్ట్ ఎపిసోడ్ లో ఓ కొరియోగ్రాఫర్ చేసిన పనికి ఈ బ్యూటీ కన్నీళ్లు పెట్టుకుంది. హైపర్ ఆది, యాంకర్ ప్రదీప్ మాచిరాజుకు కూడా ఎదురుదెబ్బ తగిలింది.

PREV
16
స్టేజ్ పై నటి శ్రద్ధాకు అవమానం.. నోటికొచ్చినట్టు మాట్లాడిన కొరియోగ్రాఫర్.. కన్నీళ్లు పెట్టుకున్న గెస్ట్ జడ్జీ

పాపులర్ డాన్స్ షో ‘ఢీ’ వరుస సీజన్లతో ప్రేక్షకులను అలరిస్తోంది. సక్సెస్ ఫుల్ రేటింగ్ తో దూసుకుపోతోంది. రీసెంట్ గానే ఢీ13ను పూర్తి చేసుకున్న ఈషో.. తాజాగా ‘ఢీ14 : ది డాన్సింగ్ ఐకాన్’ (Dhee 14) పేరుతో స్టార్ట్ అయ్యింది.  ఈషోను మరింత జోష్ గా నిర్వహిస్తున్నారు. 
 

26

ఈ షోకు జడ్జీలుగా డాన్స్ మాస్టర్ గణేశ్ మాస్టర్, హీరోయిన్ శ్రద్ధా దాస్ (గెస్ట్), నందితా శ్వేతా వ్యవహరిస్తున్నారు. ప్రదీప్ మాచిరాజ్, హైపర్ ఆది వ్యాఖ్యతలుగా ఆకట్టుకున్నారు. ఈ షోకు సంబంధించిన లేటెస్ట్ ప్రొమో తాజాగా రిలీజ్ అయ్యింది. అంతా సరదాగా కొనసాగిన ఎపిసోడ్ లో శ్రద్ధా దాస్, హైపర్ ఆది, ప్రదీప్ మాచిరాజ్ కు ఘోర అవమానం జరిగింది.
 

36

ప్రోమో ప్రకారం.. నటి శ్రద్ధా దాస్ (Shraddha Das) ఓ కొరియోగ్రాఫర్ పెర్పామెన్స్ కు ఫిదా అయ్యింది. దీంతో వెంటనే స్టేజీ మీదకు వెళ్లి స్టెప్పులేసింది. అంతే.. ఇది చూసిన మరో కొరియోగ్రాఫర్ కిరణ్ స్టేజీ మీదే శ్రద్ధాను నోటికొచ్చినట్టు మాట్లాడారు. మీరంతా ముందే అనుకొని మాపై పక్షపాతం చూపిస్తున్నారంటూ ఆరోపించారు. 
 

46

మధ్యలో జోక్యం కలుగజేసుకున్న హైపర్ ఆది, యాంకర్ ప్రదీప్ మాచిరాజ్ ను కూడా మాస్టర్ కిరణ్ దుమ్ము దులిపాడు. తమతో గ్రూప్ తో డాన్స్ చేయకపోవడం బాధాకరమన్నారు. ఇదంతా పార్శియాలిటీలా ఉందని వ్యాఖ్యానించాడు. వెంటనే శ్రద్ధా దాస్ స్పందిస్తూ ఏంటీదంతా సెన్స్ లెస్ గా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
 

56

ఇందుకు కిరణ్ బదులిస్తూ మీరొక జడ్జీ స్టేజీలో ఉండికూడా.. ఇలా చేయడం సరికాదని, పైగా ఆగ్రహం వ్యక్తం చేయడం ‘సెన్స్ లెస్’గా ఉందంటూ మండిపడ్డాడు. దీంతో శ్రద్ధా హార్ట్ అయి వెంటనే స్టేజీ మీద నుంచి వెళ్లిపోయింది. కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడింది. ఈ ఘటనతో ఒక్కసారిగా సెట్ మొత్తం సైలెంట్ గా మారింది. అసలేం జరుగుతుందోనని అయోమయంలో పడ్డారు.
 

66

అయితే, ఈ క్రమంలోనే ఆడియెన్స్ కూడా పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. రేటింగ్ కోసం ఇలాంటి ప్రీప్లాన్డ్ సన్నివేశాలను క్రియేట్ చేయడం సరికాదంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. మంచి రేటింగ్ తో వెళ్తున్న షోను ఇలాంటి ప్రయోగాలతో చెడగొట్టొద్దంటూ అభిప్రాయపడుతున్నారు. 
 
 

click me!

Recommended Stories