Rajamouli: రాజమౌళి సినిమాలపై కరణ్ జోహార్ షాకింగ్ కామెంట్స్

Published : Feb 17, 2025, 10:43 AM IST

 Rajamouli: దర్శకుడికి తన కథపై నమ్మకం ఉంటే సినిమా బ్లాక్‌బస్టర్‌ అవుతుందన్నారు. అగ్ర హీరోల సినిమాలకు దర్శకత్వం వహించిన కరణ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా విజయంపై తన అభిప్రాయాలను వివరించారు. రాజమౌళి, సందీప్ వంగా (Sandeep Reddy Vanga), అనిల్‌ శర్మల చిత్రాల గురించి ప్రస్తావించారు.

PREV
13
 Rajamouli: రాజమౌళి సినిమాలపై కరణ్ జోహార్ షాకింగ్  కామెంట్స్
Karan Johar says SS Rajamouli films lack logic in telugu


  దర్శకుడు రాజమౌళి,   బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత, దర్శకుడుకరుణ్ జోహార్ మధ్య మంచి స్నేహం ఉంది.  రాజమౌళి డైరక్ట్ చసిన ‘బాహుబలి’ రెండు భాగాల్ని హిందీలో రిలీజ్ చేసి  బాగా లాభ పడ్డారు కరణ్ జోహార్. అప్పటి నుంచి రాజమౌళి గురించి ఆయన  గొప్పగా చెబుతున్నాడు. గతంలో ఓ సారి రాజమౌళిని ‘మొఘల్ ఎ అజామ్’ తీసిన లెజెండరీ డైరెక్టర్ ఆసిఫ్ తో పోల్చాడు కరణ్.  ఈ తరంలో రాజమౌళి మించిన దర్శకుడు లేదని తీర్మానించేశాడు.

 అలాగే   కరణ్.. రాజమౌళిని ‘మ్యాన్ ఆఫ్ ద డెకేడ్’గా అభివర్ణించాడు. రాజమౌళి లాంటి మేధావితో కలిసి పని చేసినందుకు గర్వంగా ఉందని.. కచ్చితంగా ఈ తరంలో రాజమౌళే అత్యుత్తమ దర్శకుడని తేల్చేశాడు కరణ్.   ఇప్పుడు మరోసారి రాజమౌళి సినిమాల గురించి ఆయన మాట్లాడి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు.   గొప్ప సినిమాలకు లాజిక్‌తో అవసరం లేదని, అలాంటి సినిమాలు రాజమౌళి తీసారని  కరణ్‌ జోహార్‌ (Karan Johar) అన్నారు. 

23
Karan Johar says SS Rajamouli films lack logic in telugu


దర్శకుడికి తన కథపై నమ్మకం ఉంటే సినిమా బ్లాక్‌బస్టర్‌ అవుతుందన్నారు. అగ్ర హీరోల సినిమాలకు దర్శకత్వం వహించిన కరణ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా విజయంపై తన అభిప్రాయాలను వివరించారు. రాజమౌళి, సందీప్ వంగా (Sandeep Reddy Vanga), అనిల్‌ శర్మల చిత్రాల గురించి ప్రస్తావించారు. ఇంతకీ రాజమౌళి సినిమాల్లో కథల  గురించి కరణ్ జోహార్ ఏమన్నారు. 
 

33
Karan Johar says SS Rajamouli films lack logic in telugu

కరణ్ జోహార్ మాట్లాడుతూ... ‘‘కొన్ని సినిమాలు లాజిక్‌ కంటే నమ్మకం ఆధారంగా హిట్‌ అవుతాయి. గొప్ప దర్శకుల సినిమాల్లో ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. సినిమాపై నమ్మకం ఉంటే ప్రేక్షకులు లాజిక్‌ గురించి పట్టించుకోరని వారు నిరూపించారు. ఉదాహరణకు రాజమౌళి (SS Rajamouli) సినిమాలను పరిశీలిస్తే.. ఆయన చిత్రాల్లో లాజిక్‌ల గురించి ప్రేక్షకులు ఎప్పూడూ మాట్లాడరు. ఆయనకు తన కథపై పూర్తి నమ్మకం ఉంటుంది.

ఎలాంటి సన్నివేశాన్నైనా ప్రేక్షకులకు నమ్మకం కలిగేలా తెరకెక్కించగలరు. ఆర్‌ఆర్‌ఆర్‌, యానిమల్‌, గదర్‌ ఇలాంటివాటికి కూడా ఇదే వర్తిస్తుంది. వీటి హిట్‌కు ఆయా దర్శకులపై ఉన్న నమ్మకం కూడా ఒక కారణం. ఒక వ్యక్తి హ్యాండ్‌ పంప్‌తో 1000 మందిని కొడుతున్నట్లు చూపించినా అది సాధ్యమా, కాదా అని ఎవరూ చూడరు. సన్నీ దేవోల్‌ ఏదైనా చేయగలడని దర్శకుడు అనిల్‌శర్మ నమ్మారు. దాన్నే తెరపై చూపించారు. దీంతో ప్రేక్షకులు కూడా నమ్మారు. ఫలితంగా ‘గదర్‌ 2’ బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. సినిమా విజయం పూర్తిగా విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. లాజిక్‌ల గురించి ఆలోచించడం వల్ల ఉపయోగం ఉండదు. సినిమాను వినోదం కోసం మాత్రమే చూడాలి’’ అని కరణ్ అన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories