Ekta Kapoor: సినిమా, టీవీ నిర్మాత ఏక్తా కపూర్‌పై ఫిర్యాదు దాఖలైంది. ఆమెపై నమోదైన క్రిమినల్ ఫిర్యాదుపై దర్యాప్తునకు ముంబై కోర్టు శనివారం ఆదేశించింది. ఏక్తా కపూర్ రూపొందించిన వెబ్ సిరీస్‌పై ఈ ఫిర్యాదు దాఖలైనట్లుగా తెలుస్తోంది.
Producer Ekta Kapoor has landed herself into legal trouble in telugu
Ekta Kapoor: బాలీవుడ్ ప్రముఖ టీవీ, సినీ నిర్మాత ఏక్తా కపూర్ నిత్యం ఏదోక కారణంతో వివాదాల్లో నిలుస్తుంది.ఇప్పుడు తాజాగా ఓ వివాదంలో ఇరుక్కుంది. ఆమె నిర్మాతగా వ్యవహారిస్తూ చేసిన ఓ వెబ్ సిరీస్ ఆమెను కోర్ట్ కు లాగుతోంది.
ఆ వెబ్ సిరీస్‌లో భారతీయ సైనికులను అగౌరవపరిచారనే ఆరోపణలపై ఏక్తా కపూర్‌పై క్రిమినల్ కేసు నమోదు అయ్యింది. ఈ వెబ్ సిరీస్ పై ముంబై పోలీసులకు ఫిర్యాదు రావటంతో కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. ఇంతకీ ఆ సీరిస్ ఏమిటి...ఏక్తా కపూర్ ఆ సీరిస్ లో ఏం చూపించారు అనే విషయాలు చూద్దాం.
23
Producer Ekta Kapoor has landed herself into legal trouble in telugu
ఏక్తాకపూర్ చెందిన ఓటిటి యాప్ ఆల్ట్ బాలాజీలో వచ్చిన ఓ వెబ్ సీరిస్ లోని ఎపిసోడ్ లో ఒకదానిలో దేశాన్ని రక్షించే సైనికుడు “అక్రమ లైంగిక చర్య”లో పాల్గొన్నట్లు చూపించారు. ఇది సైనికుల ని తప్పుగా చూపించటం అని, దేశ గౌరవాన్ని కించపరచటం అని హిందుస్తానీ భావు అని పిలువబడే యూట్యూబర్ వికాస్ పాఠక్ కేసు పెట్టారు.
తాజాగా కీర్టు ఆమెను కలిసి ఎంక్వైరీ చేయాలని ముంబై కోర్టు నగర పోలీసులను ఆదేశించింది. అలాగే ఈ విషయమై ఇన్విస్టిగేట్ చేసి మే 9 వ తేదీ లోగా కోర్టుకు అందచేయాలని బాంద్రా మేజిస్ట్రేట్ కోర్టు, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 202 ప్రకారం ఆదేశించింది.
33
Producer Ekta Kapoor has landed herself into legal trouble in telugu
న్యాయవాది అలీ కాషిఫ్ ఖాన్ దేశ్‌ముఖ్ ద్వారా ఈ పిర్యాదు దాఖలు చేసారు . ‘భారత సైన్యం సైనిక యూనిఫాంలో జాతీయ చిహ్నంతో అభ్యంతరకరమైన చర్యలను ప్రదర్శించడం ద్వారా, నిందితులు మన దేశ ఖ్యాతిని, గౌరవాన్ని దెబ్బతీశారు…’ అని ఫిర్యాదులో పేర్కొనటం జరిగింది.
నిర్మాతగా ఏక్తా కపూర్ వివాదంలో చిక్కుకోవడం ఇది తొలి సారి కాదు.. ఆమె నిర్మించిన సినిమాలు, వెబ్ సిరీస్ పై ఇప్పటికే అనేకసార్లు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. గతంలో ఏక్తా కపూర్ నిర్మించిన ‘రాగిణి ఎంఎంఎస్ 2’ సినిమాలోని ఒక సన్నివేశం వివాదం రేపింది. ఆ సినిమా ట్రైలర్‌ను యూట్యూబ్‌లో నిషేధించారు.