Pawan Kalyan: హరీష్, ఉస్తాద్ భగత్ సింగ్ కోసం తాను ఇప్పటికే ఇలాంటి సన్నివేశాన్ని రాశానని వెల్లడించాడు. ప్రజలు దీనిని 'హరీష్ లీక్స్' లాగా చూడవచ్చని హరీష్ పేర్కొన్నాడు.
Director Harish Shankar leaks Pawan Kalyan scene in Ustad Bhagat singh in telugu
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ లో డైరెక్టర్ హరీష్ శంకర్ సీన్ లీక్ చేశారు. లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా ఫిబ్రవరి 21న రిలీజ్ కానున్న నేపథ్యంలో ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ ఈవెంట్‌లో హరీష్ పవన్ కళ్యాణ్ సీన్ లీక్ చేశారు. పవన్ పొలిటికల్ లైఫ్ లోని నిజ జీవిత సీన్ ని ఇప్పుడు సినిమాలో చూడబోతున్నారంటూ క్లూ ఇచ్చేసారు. ఈ క్రమంలో ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
23
Director Harish Shankar leaks Pawan Kalyan scene in Ustad Bhagat singh in telugu
తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్ రాబోయే చిత్రం 'డ్రాగన్' ప్రీ-రిలీజ్ ఈవెంట్ సందర్భంగా, హరీష్ గెస్ట్ లలో ఒకరిగా కనిపించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, డ్రాగన్ దర్శకుడు తాను పవన్ కళ్యాణ్ అభిమానినని, ఒకవేళ తాను సినిమా చేస్తే, పవన్ కళ్యాణ్ వాహనం పైభాగంలో ప్రయాణించే శక్తివంతమైన రీతిలో చూపిస్తానని అన్నారు.
వెంటనే హరీష్, ఉస్తాద్ భగత్ సింగ్ కోసం తాను ఇప్పటికే ఇలాంటి సన్నివేశాన్ని రాశానని వెల్లడించాడు. హరీష్ శంకర్ మాట్లాడుతూ... “పవన్ కళ్యాణ్ కారు టాప్ మీద కూర్చున్న సీన్ తీసాం. ఆల్రెడీ ఉస్తాద్ భగత్ సింగ్ లో ఆ సీన్ షూట్ చేశాం.” అని తెలిపారు.అభిమానులు దీన్ని చిరులీక్స్ లాగానే 'హరీష్ లీక్స్' లాగా చూడవచ్చని హరీష్ పేర్కొన్నారు.
33
Director Harish Shankar leaks Pawan Kalyan scene in Ustad Bhagat singh in telugu
గత కొద్ది రోజులుగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఆగిందంటూ ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారాన్ని కూడా ఇలా హరీష్ పరోక్షంగా ఖండించారు. ఇక సీన్ విషయానికి వస్తే.. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామ పర్యటనకు వెళ్లారు పవన్ కల్యాణ్.
మంగళగిరిలోని పార్టీ కార్యాలయం నుంచి తన కాన్వాయ్ లో బయలుదేరిన పవన్… ఇప్పటం గ్రామం చేరుకోకముందే మధ్యలోనే తాను ప్రయాణిస్తున్న కారు టాప్ పైకి ఎక్కారు. కారు టాప్ పై అలా కాళ్లు బారజాపుకుని మరీ ఆయన రిలాక్డ్స్ డ్ గా కూర్చున్నారు. కారు వేగంగా దూసుకుపోతున్నా చలించని పవన్… కారుపై అలానే రిలాక్స్ డ్ గా కూర్చున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.