నయనతార స్టార్‌ హీరోయిన్‌ కాదంటూ బాలీవుడ్‌ మేకర్‌ అనుచిత వ్యాఖ్యలు.. సారీ చెప్పాలంటూ ఫ్యాన్స్ ట్రోలింగ్‌

Published : Jul 25, 2022, 03:40 PM ISTUpdated : Jul 25, 2022, 03:41 PM IST

సౌత్‌ లేడీ సూపర్‌ స్టార్ నయనతారపై బాలీవుడ్‌ మేకర్‌ చేసిన కామెంట్లు నెట్టింట దుమారంరేపుతుంది. ఆమె అభిమానులు ఆయన్ని దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు.   

PREV
16
నయనతార  స్టార్‌ హీరోయిన్‌ కాదంటూ బాలీవుడ్‌ మేకర్‌ అనుచిత వ్యాఖ్యలు.. సారీ చెప్పాలంటూ ఫ్యాన్స్ ట్రోలింగ్‌

గ్లామర్‌ హీరోయిన్‌ నుంచి అంచెలంచెలు ఎదుగుతూ వస్తోన్న నయనతార(Nayanthara). గ్లామర్‌ హీరోయిన్ అనే ముద్రని దాటుకుని ఇప్పుడు లేడీ సూపర్‌స్టార్‌(Lady SuperStar)గా ఎదిగింది. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. ఆమె నటించిన చిత్రాలు స్టార్‌ హీరోలకు దీటుగా కలెక్షన్లని సాధిస్తుండటం విశేషం. తెలుగు, తమిళం, మలయాళంలోనూ నటిస్తూ ఆకట్టుకుంటుంది. ఇప్పుడు బాలీవుడ్‌ ఎంట్రీ కూడా కన్ఫమ్‌ అయ్యింది. 

26

ఇంతగా తిరుగులేని స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న నయనతారపై బాలీవుడ్‌ స్టార్‌ మేకర్ కరణ్‌ జోహార్‌ (Karan Johar) చేసిన కామెంట్‌ నెట్టింట దుమారం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలు వివాదంగా మారుతున్నాయి. ప్రస్తుతం స్ట్రీమింగ్‌ అవుతున్న `కాఫీ విత్‌ కరణ్‌` (Koffee with Karan)షోలో సమంత, అక్షయ్‌ కుమార్‌ పాల్గొన్న విషయం తెలిసిందే. ఇందులో నయనతార గురించి ప్రస్తావించింది సమంత(Samantha). 

36

మీకిష్టమైన హీరోయిన్‌ గురించి చెప్పాల్సిన వచ్చినప్పుడు సమంత.. నయనతార పేరు చెప్పారు. తనని సౌత్‌ సూపర్‌ స్టార్‌ అంటూ కితాబిచ్చింది సమంత. ఆమెతో వర్క్ చేయడం గొప్పగా ఉందని, మర్చిపోలేని అనుభవం అని తెలిపింది. ఈ క్రమంలో కరణ్‌ జోహార్‌ కల్పించుకుని ఆమె తన లిస్ట్ లో స్టార్‌ కాదని చెప్పడం ఇప్పుడు వివాదానికి కారణమవుతుంది. 

46

కరణ్‌ జోహార్‌ ఈ కామెంట్‌తో నయనతార అభిమానులు బాగా హర్ట్ అయ్యారు. ఓ సూపర్‌ స్టార్‌ లాంటి హీరోయిన్‌ని పట్టుకుని తన లిస్ట్ లో ఆమె పేరు లేదని చెప్పడం నయనతారని అవమానించడమే అవుతుందని, దీనిపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. లేడీ సూపర్‌ స్టార్‌ని పట్టుకుని ఆ వ్యాఖ్యలేంటి అంటూ మండిపడుతున్నారు. కరణ్‌ సారీ చెప్పాల్సిందే అని డిమాండ్‌ చేస్తూ, ఆయన్ని దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. సౌత్‌ వాళ్లపై ఉన్న చిన్నచూపుకిది నిదర్శమని కామెంట్‌ చేస్తున్నారు. దీన్నిపై తీవ్రంగా నిరసన వ్యక్తం చేయాల్సిందే అంటున్నారు. 
 

56

దీంతో నెట్టింట గత మూడు రోజులుగా రచ్చ జరుగుతుంది. ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా సెల్ఫ్‌  మేడ్‌ యాక్టర్‌గా ఎదిగి, తిరుగులేని ఇమేజ్‌ని సొంతం చేసుకుని ఈ స్థాయికి అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్లలో టాప్‌లో నిలిచిన నయనతారకి ఇంతటి అవమానామా? అంటూ ఆమె అభిమానులు తీవ్ర స్థాయిలో కరణ్‌ జోహార్‌పై మండిపడుతున్నారు. మీమ్స్ చేస్తూ ఆయన్ని ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. మరి దీనిపై కరణ్‌జోహార్‌ స్పందిస్తారా? క్షమాపణలు చెబుతారా? అనేది చూడాలి. 

66

నయనతార ఇటీవల తన ప్రియుడు, దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అత్యంత వైభవంగా వారి వివాహం జరిగింది. విగ్నేష్‌ రూపొందించిన సినిమాలో నయనతార, సమంత కలిసి నటించడం విశేషం.ఇప్పుడు నయనతార తమిళంలో `ఇరైవన్‌`, `కనెక్ట్`తోపాటు మరో సినిమా చేస్తుంది. మలయాళంలో ఓ చిత్రం, తెలుగులో `గాడ్‌ ఫాదర్‌`లో నటిస్తుంది. హిందీలోకి ఎంట్రీ ఇస్తూ షారూఖ్‌ ఖాన్‌తో కలిసి `జవాన్‌` చిత్రంలో నటిస్తుంది. అట్లీ దర్శకుడు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories