Alia Bhatt: టెంట్ గుడ్డ కట్టుకొచ్చావా... అలియా డ్రెస్ పై నెటిజెన్స్ సెటైర్స్, కారణంతోనే ఆ డ్రెస్ 

Published : Jul 25, 2022, 03:05 PM IST

బాలీవుడ్ స్టార్స్ లో అలియా భట్ దారుణంగా ట్రోల్స్ గురవుతూ ఉంటారు. దానికి ప్రధాన కారణం ఆమె స్టార్ కిడ్ కావడం వలెనే. స్టార్ డైరెక్టర్ మహేష్ భట్ కూతురిగా ఆమె బాలీవుడ్ లో రాణిస్తున్నారు, అంతకు మించి చెప్పుకోదగ్గ టాలెంట్ లేదనేది పలువురి వాదన.

PREV
17
Alia Bhatt: టెంట్ గుడ్డ కట్టుకొచ్చావా... అలియా డ్రెస్ పై నెటిజెన్స్ సెటైర్స్, కారణంతోనే ఆ డ్రెస్ 
Alia Bhatt

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత ఆమె దారుణమైన సోషల్ మీడియా వేధింపులకు గురయ్యారు. కొన్ని నెలల పాటు ఆమె సోషల్ మీడియాకు దూరమయ్యారు. సుశాంత్ ఫ్యాన్స్, నేపోటిజం వ్యతిరేకులు అలియా భట్ ని సోషల్ మీడియాలో అసభ్యకర కామెంట్స్, హేట్ కామెంట్స్ తో ఇబ్బంది పెట్టారు.

27
Alia Bhatt


అదే సమయంలో తండ్రి దర్శకత్వంలో అలియా నటించిన సడక్ 2 విడుదలైంది. మహేష్, అలియా లపై ఉన్న కోపాన్ని ప్రేక్షకులు సడక్ 2 పై చూపించారు. అత్యంత చెత్త రికార్డు ఆ మూవీకి కట్టబెట్టారు. సడక్ 2 చిత్రాన్ని బాయ్ కాట్ చేయాలని పిలుపునిచ్చారు. 
 

37
Alia Bhatt

ఈ సోషల్ మీడియా వేధింపులు సర్వసాధనమైపోవడంతో అలియా భట్ వాటిని పట్టించుకోవడం మానేశారు. తాజా అలియా భట్ డ్రెస్ పై నెటిజన్స్ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఆమెను ట్రోల్ చేస్తున్నారు. అలియా నటించిన డార్లింగ్స్ మూవీ నెట్ ఫ్లిక్స్ లో ఆగస్టు 5 నుండి స్ట్రీమ్ కానుంది. ఈ మూవీ ట్రైలర్ విడుదల ఈవెంట్ లో అలియా పాల్గొన్నారు. 
 

47
Alia Bhatt

ఇక అలియా డార్లింగ్స్ ట్రైలర్ రిలీజ్ వేడుకకు యెల్లో ట్రెండీ వేర్ లో హాజరయ్యారు. చాలా షార్ట్ గా ఉన్న ఆ డ్రెస్ వదులుగా రైన్ కోట్ ని తలపిస్తుంది. కొంచెం ఫన్నీగా, డిఫరెంట్ గా ఉన్న ఆ డ్రెస్ పై నెటిజెన్స్ సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు. ఒక నెటిజెన్ మేడం... షాపింగ్ బ్యాగ్ క్రింద పగిలిపోయిందా అంటూ కామెంట్ చేయగా, మరొకరు టెంట్స్ వేసే టార్పాలిన్ డ్రెస్ గా వేసుకొచ్చావా? అని కామెంట్ చేశాడు.

57
Image: Virender Chawla


వేరొకరైతే రైన్ కోటు డ్రెస్ లా ధరించావా అని కామెంట్ చేశాడు. అలియా భట్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలపై నెటిజెన్స్ మరిన్ని నెగిటివ్ కామెంట్స్ తో విరుచుకు పడ్డారు. నిజానికి అలియా అలా వదులు డ్రెస్ ధరించి రావడానికి కారణం ఉంది . ప్రస్తుతం అలియా గర్భవతి. అందులోనూ కవలలకు జన్మనివ్వనున్నట్లు తెలుస్తుంది. 
 

67
Image: Virender Chawla


ఏప్రిల్ 14న రన్బీర్ కపూర్-అలియా వివాహం జరిగింది. పెళ్లైన రోజుల వ్యవధిలో అలియా తన ప్రెగ్నెన్సీ ప్రకటించారు. దాదాపు ఐదేళ్లు ప్రేమించుకుంటున్న ఈ జంట పెళ్లి చేసుకున్న ఏడాది లోపే తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ క్రమంలో అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. 

77
Image: Virender Chawla

ఇక అలియా భట్-రన్బీర్ కపూర్ జంటగా నటించిన భారీ చిత్రం బ్రహ్మాస్త్ర. ఈ మూవీ సెప్టెంబర్ 9న వరల్డ్ వైడ్ పలు భాషల్లో విడుదల కానుంది. బ్రహ్మాస్త్ర మూవీలో అమితాబ్, నాగార్జున వంటి స్టార్స్ కీలక రోల్స్ చేస్తున్నారు.

click me!

Recommended Stories