వాళ్లిద్దరినీ కరెక్ట్ టైమ్ కు దింపాడే ఎన్టీఆర్... వాటే స్ట్రాటజీ

First Published Apr 10, 2024, 4:37 PM IST

ఒక మాస్ తుపాను మనందరినీ ముంచేయడానికి త్వరలోనే రాబోతుంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ ఎన్టీఆర్ 'దేవర' సినిమాలో భాగం అయినందుకు గౌరవంగా భావిస్తున్నాను. 


సినిమాలో నటించటం ఒకెత్తు...దాన్ని జనాల్లోకి తీసుకెళ్లటం మరెక సర్కస్ ఫీట్. పోటీ పెరిగిపోయిన ఈ సమయంలో ప్రతీ విషయంలోనూ ఆచి,తూచి అడుగులు వేయాల్సి వస్తోంది హీరోలు, నిర్మాతలు. ఎన్టీఆర్ ఈ విషయంలో తనేమీ తక్కువ కాదు అని ప్రూవ్ చేసుకుంటున్నారు. తన తాజా చిత్రం దేవర ని ప్యాన్ ఇండియా స్దాయిలో రిలీజ్ చేయటమే కాకుండా అక్కడ కూడా ఎలాగైనా సూపర్ హిట్ కొట్టి జెండా పాతింగే అనాలని ఫిక్స్ అయ్యారు. అందులో భాగంగా ఆయన వేసే స్టెప్స్ ...టాలీవుడ్ ని విస్మయపరుస్తున్నాయి.
 


  'దేవర' సినిమా అక్టోబర్ 10న దసరా కానుకగా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. రెండు పార్ట్ లుగా విడుదల అవుతున్న ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. అలాగే ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత బ్లాక్ బస్టర్ కొట్టాలనే కసితో కొరటాల ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో గ్రాండ్‌గా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు దేవర టీమ్ ప్లాన్ చేస్తుంది. ఇందులో భాగంగా ముఖ్యమైన నార్త్ థియేట్రికల్ రిలీజ్‌ కోసం బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్‌‌ను రంగంలోకి దింపింది.
 


"ఈ విషయాన్ని కరణ్ జోహార్ సోషల్ మీడియాలో వేదికగా ప్రకటించారు. ఒక మాస్ తుపాను మనందరినీ ముంచేయడానికి త్వరలోనే రాబోతుంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ ఎన్టీఆర్ 'దేవర' సినిమాలో భాగం అయినందుకు గౌరవంగా భావిస్తున్నాను. నార్త్ థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ సొంతం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇండియన్ సినిమాలో బిగ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ కోసం అందరూ సిద్ధంగా ఉండండి" అంటూ కరణ్ జోహార్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు.


కరణ్ జోహార్‌తో పాటు AA ఫిలిమ్స్ సంయుక్తంగా నార్త్‌లో దేవర సినిమాను రిలీజ్ చేయబోతుంది. కరణ్ జోహార్‌ లాంటి నిర్మాత బాలీవుడ్‌లో దేవరను రిలీజ్ చేస్తుండటంతో దేవర మూవీ టీమ్ ఫుల్ ఖుషీగా ఉంది. దీన్ని బట్టి చూస్తే దేవర సినిమాను నార్త్‌లో వీలైనంత ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
 


వరల్డ్‌వైడ్‌ బ్లాక్ బస్టర్ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న చిత్రం కావడం వలన కూడా ‘దేవర’పై అంతటా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా బాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను స్టార్ ప్రొడ్యూసర్ క‌ర‌ణ్ జోహార్ దక్కించుకోవటం భారీ బజ్ వస్తుందని భావిస్తున్నారు.   ఈ ఏడాది అక్టోబర్ 10న దేవర సినిమాను హిందీలో ధ‌ర్మ ప్రోడ‌క్ష‌న్స్ విడుద‌ల చేయనుందని అందులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్, కొరటాల శివతో కరణ్ జోహార్ బృందం కలిసిన ఫోటో ఒకటి పంచుకున్నారు. జాహ్నవిని హీరోయిన్ గా తీసుకున్నప్పుడే మాగ్జిమం బాలీవుడ్ ని జయించటానికే ఈ స్కెచ్ అని అర్దమైంది. అలాగే సైఫ్ అలీ ఖాన్ సైతం ఇప్పుడు హిందీ మార్కెట్ బజ్ కు ఓ రేంజిలో ఉపయోగపడనున్నారు.


మరో ప్రక్క దేవర నిర్మాతలు 145 కోట్ల  థ్రియేటర్ బిజినెస్ ని రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్సపెక్ట్ చేస్తున్నారు. ఇది ఎన్టీఆర్ నుంచి సోలోగా వచ్చే పెద్ద ప్యాన్ ఇండియా చిత్రం కాబట్టి భారీ బడ్జెట్ పెడుతున్నారు.  దాంతో బిజినెస్ ఎక్సపెక్టేషన్స్ ఆ స్దాయిలోనే ఉంటాయి.  ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ కు బిజినెస్ ఎక్సపెక్టేషన్స్ చూస్తే... ఆంధ్రా నుంచి 65 కోట్లు, సీడెడ్ నుంచి 25 కోట్లు, నైజాం నుంచి 55 కోట్లు ఎక్సపెక్ట్ చేస్తున్నట్లు ట్రేడ్ లో వినిపిస్తోంది. ఖచ్చితంగా నెగోషియేషన్స్ ఉంటాయి కాబట్టి ఫైనల్ గా ఎంతకు బిజినెస్ డీల్స్ సెట్ అవుతాయో చూడాలి.
   

  దేవర సినిమాలో ఒక కొత్త ప్రపంచం, చాలా బలమైన పాత్రలు, అత్యంత భారీతనం ఉంటుందని అన్నారు. అందుకే ఒకే భాగంలో దేవర కథను పూర్తిగా చూపించడం కష్టమని అనిపిస్తోందని కొరటాల చెప్పారు. అందుకే రెండు పార్ట్‌ల్లో దేవర సినిమాను తీసుకురావాలని నిర్ణయించినట్టు వివరించారు. రూ.300 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జాన్వీ కపూర్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సైఫ్‌ అలీఖాన్   విలన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.   ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.  
 


ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్, సంయుక్తంగా నిర్మిస్తున్న ‘దేవర’ సినిమా రెండు భాగాలుగా రూపొందుతోంది. ఈ క్రమంలో మొదటి భాగం వచ్చే ఏడాది అక్టోబర్ 10న పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ రిలీజ్ చేయనున్న‌ట్లు మేక‌ర్స్ ఇప్ప‌టికే స్ప‌ష్టం చేశారు. శ్రీకర ప్రసాద్ ఎడిటర్‌గా.. సాబు సిరిల్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. మరోవైపు ఈ సినిమా తర్వాత తారక్ ‘వార్ 2’ సినిమాతో బాలీవుడ్‌లో అడుగు పెట్టబోతున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ స్పై థ్రిల్లర్‌లో హృతిక్ రోషన్‌తో కలిసి ఆయన నటించనున్నారు. అలాగే ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఎన్టీఆర్ భారీ చిత్రం చేయనున్నారు.
 


‘జనతా గ్యారేజ్’ తర్వాత కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్‌ కాంబోలో వస్తున్న చిత్రం    'దేవర' .ఈ సినిమాకు మంచి బిజినెస్ జరుగుతోంది. ఎక్సపెక్టేషన్స్ పెరిగాయి. ఇప్పటికే విడుదల చేసిన లుక్‌, గ్లింప్స్ లో   చేతిలో ఆయుధంతో ఎన్టీఆర్ లుక్ ఫెర్రోషియస్‌గా ఉంది. ఈ గ్లిప్స్ చూసిన వారంతా ఎన్టీఆర్ కెరియర్ లో దేవర బెస్ట్ మూవీగా నిలిచే అవకాశం ఉందని అంటున్నారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కంప్లీట్ ఫిక్షనల్ కథాంశంతో సిద్ధమవుతోన్న ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల రైట్స్ కు ఓ రేంజిలో పోటీ నెలకొని ఉంది. అలాగే  ఓవర్ సీస్ రైట్స్ డీల్ క్లోజ్ చేసినట్లు సమాచారం.


 ‘దేవర’లో ఎన్టీఆర్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం.   దేవర సినిమాలో ఒక కొత్త ప్రపంచం, చాలా బలమైన పాత్రలు, అత్యంత భారీతనం ఉంటుందని అన్నారు. అందుకే ఒకే భాగంలో దేవర కథను పూర్తిగా చూపించడం కష్టమని అనిపిస్తోందని కొరటాల చెప్పారు. అందుకే రెండు పార్ట్‌ల్లో దేవర సినిమాను తీసుకురావాలని నిర్ణయించినట్టు వివరించారు. 
 


రూ.300 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జాన్వీ కపూర్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సైఫ్‌ అలీఖాన్   విలన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.   ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.  


మరో ప్రక్క ఎన్టీఆర్ బాలీవుడ్ రంగప్రవేశానికి అంతా సిద్దమైంది.  'వార్ 2'తో బాలీవుడ్‌లో అరంగేట్రం చేస్తున్నాడు. నందమూరి కుటుంబ వారసుడికి హిందీలో మంచి ఫాలోయింగ్ ఉందని అర్దం చేసుకున్న హిందీ నిర్మాణ సంస్దలు ఆయన్ని తమ సినిమాల్లో చేయమని అడుగుతున్నారు. ఇదంతా ఎన్టీఆర్ తాజా చిత్రం దేవర బిజినెస్ కు కలిసి వస్తోంది. అక్కడ మీడియా ఇప్పుడు ఎన్టీఆర్ గురించి మాట్లాడుతోంది. దాంతో ఎన్టీఆర్ దేవర కొనటానికి అక్కడ బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్స్ ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే ఇదేమీ ఇప్పుటికిప్పుడు వచ్చిన క్రేజ్ కాదు.

click me!