సూపర్‌ స్టార్ కృష్ణతో సినిమా తీసి అడ్రస్‌ లేకుండా పోయిన స్టార్‌ హీరో ఎవరో తెలుసా? కోలుకోలేని దెబ్బ

Published : Jul 27, 2025, 10:46 AM IST

సూపర్‌ స్టార్‌ కృష్ణతో సినిమా తీసి నష్టపోయిన నిర్మాతలు ఉండరు. ఆయన చాలా వరకు రిటర్న్ ఇస్తారు. కానీ ఓ స్టార్‌ హీరో మాత్రం కోలుకోలేకపోయారు. ఆయనెవరో తెలుసుకుందాం. 

PREV
16
కృష్ణతో సినిమా నిర్మించి కోలుకోలేని దెబ్బ తిన్న హీరో

సినిమా ఇండస్ట్రీలో నిర్మాత జీవితం గాలి బుడగలాంటిది. ఏ సినిమా ముంచుతుందో, ఏ సినిమా లేపుతుందో తెలియదు. ఎన్ని సినిమాలు లేపినా, ఒక్క సినిమా చాలు అడ్రస్‌ లేకుండా పోవడానికి. 

సూపర్‌ స్టార్‌ కృష్ణతో ఓ స్టార్‌ హీరో నిర్మాతగా ఓ సినిమాని నిర్మించారు. ఆ మూవీ పరాజయం ఆయన్ని కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఆ తర్వాత ఆయన డౌన్‌ఫాల్‌ స్టార్ట్ అయ్యింది. కొన్నాళ్లకి అడ్రస్‌ లేకుండా పోయే పరిస్థితి ఏర్పడింది.

DID YOU KNOW ?
నిర్మాతగా కాంతారావు
కత్తి వీరుడు కాంతారావు నిర్మాతగా `సప్తస్వరాలు`, `గండర గండడు`, `ప్రేమ జీవులు`, `గుండెలు తీసిన మొనగాడు`, `స్వాతిచినుకులు` చిత్రాలను నిర్మించారు.
26
నిర్మాతల పాలిట దేవుడు కృష్ణ

సూపర్‌ స్టార్‌ కృష్ణని ఇండస్ట్రీలోనే గొప్పమనసు కలిగిన హీరో అంటారు. తనతో సినిమాలు నిర్మించిన నిర్మాతలకు అండగా ఉంటాడని, సినిమా నష్టాలు వస్తే తన పారితోషికం తిరిగి ఇస్తాడని అంటుంటారు. 

చాలా మంది నిర్మాతలు కూడా ఆ విషయాన్ని చెప్పారు. ఆ విషయంలో దేవుడిగా పిలుస్తుంటారు. కానీ ఓ హీరో మాత్రం ఆయన సహాయం తీసుకోలేదు.

 దారుణంగా నష్టపోయి ఆ తర్వాత కనుమరుగు అయ్యారు. ఆయన ఎవరో కాదు తొలితరం తెలంగాణ హీరోగా, కత్తి వీరుడు కాంతారావు. 

36
తొలితరం హీరో, కత్తి వీరుడు కాంతారావు

కాంతారావు.. తొలితరం హీరో. ఎన్టీఆర్‌, ఏఎన్నార్, ఎస్వీఆర్‌ల టైమ్‌లో హీరోగా రాణించారు. అనేక సినిమాల్లో హీరోగా చేశారు. 

ఓ వైపు ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ వంటి వారితో కలిసి సినిమాలు చేస్తూనే తాను సోలో హీరోగా కూడా పలు సినిమాలు చేసి విజయాలు సాధించారు. మంచి స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు.

 కత్తివీరుడిగా రాణించారు, కత్తి యుద్ధాలకు కేరాఫ్‌గా నిలిచారు. పౌరాణిక చిత్రాల్లో చాలా వరకు కాంతారావు ఉండాల్సిందే అనేట్టుగా ఉండేది. ఎన్టీఆర్‌ సైతం తన సినిమాల్లో కాంతారావుని తీసుకునేవారు. అలా నటప్రపూర్ణగా కీర్తించబడ్డారు కాంతారావు.

46
కృష్ణతో `ప్రేమజీవులు` నిర్మించిన కాంతారావు

కానీ కాంతారావు కెరీర్‌ డౌన్‌ అయ్యింది మాత్రం నిర్మాతగానే అని చెప్పాలి. ఆయన నిర్మాతగా హేమ ఫిల్మ్స్ పై `సప్తస్వరాలు` చిత్రం నిర్మించారు. తనే హీరో. 

ఈ చిత్రం మంచి విజయం సాధించింది. కాంతారావు మంచి బూస్ట్ ఇచ్చింది. అదే ఏడాది `గండరగండుడు` మూవీని నిర్మించారు. ఇది సరిగా ఆడలేదు. 

రెండేళ్లు గ్యాప్‌ తీసుకుని సూపర్‌ స్టార్‌ కృష్ణ హీరోగా `ప్రేమజీవులు` అనే మూవీని నిర్మించారు. ఇందులో తనుకూడా ఓ హీరో. కేఎస్‌ఆర్‌ దాస్‌ దర్శకుడు. 

1971లో వచ్చిన ఈ మూవీ ఘోర పరాజయం చెందింది. అప్పట్లో భారీ బడ్జెట్‌తోనే నిర్మించారు. కానీ బాక్సాఫీసు వద్ద దారుణంగా బోల్తా పడింది. ఈ చిత్రంతోనే కాంతారావు ఉన్నదంతా పోగొట్టుకున్నారట.

56
`ప్రేమ జీవులు` సినిమాతోనే నాన్నకి డౌన్‌ఫాల్‌

ఆ తర్వాత కెరీర్‌ డౌన్‌ అయ్యిందని చెప్పారు కాంతారావు కూతురు సుశీల. ఈ సినిమా పోయినందుకు కృష్ణ నష్టాలను రిటర్న్ ఇస్తానని అన్నారట. కానీ కాంతారావు తీసుకోలేదట.

 అదే ఆయన చేసిన పెద్ద తప్పు. ఆ తర్వాత నిర్మాతగా ఒకటి రెండు చిత్రాలు చేశారు. అవి కూడా ఆడలేదు. మూలిగే నక్కపై తాడిపండు పడ్డటయ్యింది. మరింతగా కోలుకోలేకపోయారు కాంతారావు. 

ఆ తర్వాత నటుడిగానూ సినిమాలు చేశారు. కానీ హీరోగానూ సినిమాలు రాలేదు. ఇతర హీరోల చిత్రాల్లో క్యారెక్టర్స్ వేస్తూ కాలం వెల్లదీశారు, కానీ ఆ పూర్వ వైభవం పొందలేకపోయారు.

66
చివరి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులతో కాంతారావు

ఆ తర్వాత ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారని, ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సపోర్ట్ చేయలేదని, ఆదుకునేవారే లేరని తెలిపింది కూతురు సుశీల. 

నాన్నగారు కూడా వచ్చిన డబ్బుని సరిగా వాడుకోలేకపోయారని, ఎలా డబ్బుని పెంచుకోవాలో తెలియలేదని, దీంతో ఆయనకష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరులా మారిందన్నారు కూతురు. సుమన్‌ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను ఆమె వెల్లడించారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories