2026 కోసం రిషబ్ శెట్టి మాస్టర్ ప్లాన్ రెడీ.. జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయబోతన్నాడా?

Published : Dec 23, 2025, 01:51 PM IST

Rishab Shetty Master Plan : కాంతారా చాప్టర్ 1 చిత్రం ఘన విజయం తర్వాత, 2026 కోసం ఒక ప్రత్యేక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశానని, దానిని త్వరలో ప్రకటిస్తానని రిషబ్ శెట్టి తెలిపారు. ఇంతకీ అతను ఏం చేయబోతున్నాడు? 

PREV
15
కాంతారా స్టార్ రిషబ్ శెట్టి మాస్టర్ ప్లాన్..

'కాంతారా' రెండు సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రిషబ్ శెట్టి, 2026 కోసం తన మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేశారు. అభిమానుల కోసం ఒక ప్రత్యేకమైన భారీ ప్రాజెక్ట్‌ను ఆయన ప్రకటంచబోతున్నారు. ఇంతకీ రిషబ్ శెట్టి ప్లాన్ ఏంటి?

25
నటన - ‌దర్శకత్వం ఏదో ఒకటే?

చాలా రోజులుగా రిషబ్ శెట్టి ఓ పాన్ ఇండియా సినిమాను డైరెక్ట్ చేయబోతున్నట్టు ప్రచారం జరిజింది. టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్నట్టు రూమర్స్ వినిపించాయి. కానీ 2026లో తాను దర్శకత్వం వహించనని, కేవలం నటుడిగా మాత్రమే కొనసాగుతానని రిషబ్ శెట్టి స్పష్టం చేశారు. ప్రశాంత్ వర్మ 'జై హనుమాన్' చిత్రంలో ఆయన నటించనున్నారు.

35
చరిత్ర సృష్టించిన 'కాంతారా

రిషబ్ శెట్టి కాంతార రెండు సినిమాలతో సంచలనం సృష్టించాడు. బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టాడు. కాంతార చాప్టర్ 1 సినిమా 850 కోట్ల వరకూ కలెక్షన్లు సాధించి రికార్డు సృష్టించింది. క్రేజ్ తో రిషబ్ శెట్టి 2026లో కొత్త ప్రాజెక్ట్‌ కు శ్రీకారం చుట్టుబోతున్నారు.

45
రిషబ్ శెట్టి రాబోయే చిత్రాలు

రిషభ్ శెట్టి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తెలుగులో అతను ‘జై హనుమాన్’ సినిమాతో పాటు బాలీవుడ్ లో 'ఛత్రపతి శివాజీ మహారాజ్', 'కాంతారా చాప్టర్ 2' వంటి భారీ చిత్రాలు రిషబ్ శెట్టి లైనప్‌లో ఉన్నాయి. ఈ చిత్రాలు 2026, 2027లో విడుదల కానున్నాయి.

55
బహుముఖ ప్రజ్ఞాశాలి రిషబ్ శెట్టి

'కిరిక్ పార్టీ'తో దర్శకుడిగా, 'కాంతారా'తో నటుడిగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రిషబ్ శెట్టి, తన భవిష్యత్ ప్రణాళికలతో ప్రేక్షకులను ఆశ్చర్యపరచడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఆయన ఏం చేయబోతున్నాడు. ఎలాంటి సర్ ప్రైజ్ ప్రాజెక్ట్ తో  రాబోతున్నాడు అనేది చూడాలి. 

Read more Photos on
click me!

Recommended Stories